ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు చాలా తగ్గిపోయాయి. ప్రైవేటు కొలువులు కూడా అంత ఈజీగా దొరకడం లేదు. మల్టీ టాలెంట్ ఉన్నవారినే ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన వారికి కూడా భారీ ప్యాకేజీలు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఎయిర్ పోస్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) శుభవార్త చెల్పింది. కేలవం ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీ వేతన ప్యాకేజీలో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థులు డిప్రొమో లేదా గ్రాడ్యుయేషన్ లేదా 12వ తరగతి లేదా మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉండాలి. పరీక్ష తేదీ ఇంకా ప్రకటించలేదు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.
సంస్థ వివరాలు..
ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టులన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలు.
ఖాళీల వివరాలు…
ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 224 ఉద్యోగాలు భర్తీ చేస్తుంది.
వయో పరిమితి..
ఏఏఐ విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అయితే నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు 5 ఏళ్లు ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
విద్యార్హత..
అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ లేదా 12వ తరగతి లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. వీరుమాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వేతనం వివరాలు..
ఉద్యోగాలకు ఎంపికైన అబ్యర్థులకు నెలకు రూ.1 లక్ష వేతనం ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్థులు అన్‌రిజర్వు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లంచాల్సిన అవసరం లేదు. దరఖాస్తుకురి తేదీ మార్చి 5.
ఎంపిక విధానం..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో క్వాలీఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ స్కిల్ టెస్టు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగులకుంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి డ్రైవింగ్! టెస్టు, పిలికల్ టెస్ట్ ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ టెస్టు ఇస్తారు.