Homeబిజినెస్Elon Musk - Twitter : ఎలాన్ మస్క్ కు తెలిసిందే మస్కా కొట్టడం.. "ట్విట్టర్లో...

Elon Musk – Twitter : ఎలాన్ మస్క్ కు తెలిసిందే మస్కా కొట్టడం.. “ట్విట్టర్లో బ్లూ టిక్కు” ఓ మాయాజాలం.. చదవాల్సిన స్టోరీ ఇది

Elon Musk – Twitter :  అటువంటి వ్యాపారి పిసినారి తనం చేస్తున్నాడు. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత.. దానిద్వారా అడ్డగోలుగా ఆదాయాన్ని సంపాదించడానికి.. యూజర్ల నుంచి ఇష్టానుసారంగా దోచేయడానికి మస్క్ చేయని ప్రయత్నం అంటూ లేదు.. కాకపోతే వైట్ కలర్ దోపిడీకి బ్లూ టిక్ అని పేరు పెట్టాడు. దీనికి ప్రీమియం అనే ట్యాగ్ లైన్ తగిలించాడు. బ్లూటిక్ ఇచ్చినందుకు ఒక్క యూజర్ నుంచి ప్రతి నెలకు ₹1000 అడ్డగోలుగా దోచేశాడు.. అంతేకాదు 500 మంది ప్రీమియం ఫాలోవర్స్ ను కనుక సంపాదించుకుంటే డబ్బులు ఇస్తానని చెప్పేశాడు.. కానీ దీనికి అనేక రకాల షరతులు విధించాడు. దీంతో ప్రతి నెలా 1000 రూపాయలు ఒక్కో యూజర్ నుంచి వసూలు మాత్రం చేస్తున్నాడు.. ఇలా ట్విట్టర్ ఎక్స్ ద్వారా సంపాదించిన డబ్బులతో మస్క్ మరిన్ని వ్యాపారాలు చేస్తున్నాడు. టెస్లా కారులో సరికొత్త మోడల్స్ తీసుకొచ్చాడు. స్పేస్ ఎక్స్ ను నాసా కంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాడు. అంతే కాదు శాటిలైట్ ఇంటర్నెట్ కు బాటలు పరుస్తున్నాడు. అంటే ప్రతి వ్యాపారాన్ని కూడా ఒక పద్ధతిగా.. వినూత్నంగా మస్క్ చేసుకుంటూ పోతున్నాడు. ఇందులో సొంత పైసలు లేవు. జస్ట్ జనానికి ఒక వ్యసనాన్ని అలవాటు చేసి.. దాని ద్వారా అతడు దండిగా సంపాదిస్తున్నాడు. అది టెస్లా కారు కావచ్చు.. ట్విట్టర్ ఎక్స్ కావచ్చు.. స్పేస్ ఎక్స్ కావచ్చు.. అంతిమంగా లాభ పడేది మాత్రం మస్క్ మాత్రమే.

మరిన్ని వ్యాపారాల్లోకి..

ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అవుట్ రైట్ గా ట్రంప్ కు మస్క్ మద్దతు పలికాడు. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాడు. అతడు ఊహించినట్టుగానే ట్రంప్ గెలిచాడు. తన మార్క్ పరిపాలన మొదలుపెట్టాడు. అంతేకాదు తన ప్రభుత్వంలో మస్క్ కు అపరిమితమైన ప్రాధాన్యమిచ్చాడు. అంతే ఇంకేముంది మస్క్ దూసుకుపోతున్నాడు. మరిన్ని వ్యాపారాల్లోకి అడుగుపెట్టాలని ట్రై చేస్తున్నాడు. ట్రంప్ సపోర్ట్ ఉండడం.. చేతిలో లెక్కకు మిక్కిలి డబ్బు ఉండడంతో మస్క్ ఆడింది ఆట.. పాడింది పాటగా మారిపోతుంది. అయినప్పటికీ.. ఈ స్థాయిలో ఆదాయాన్ని సంపాదిస్తున్నప్పటికీ.. మస్క్ తన బ్లూటిక్ వ్యాపారాన్ని వదులుకోలేదు. పైగా అంతకంతకు విస్తరిస్తున్నాడు. అందుకే అంటారు తెలివైన వ్యాపారి డబ్బులను ఖర్చు పెట్టుకోడని.. ఇలా ట్విట్టర్ ఎక్స్ ద్వారా వచ్చిన డబ్బులతో.. బ్లూటిక్ ద్వారా వస్తున్న ఆదాయంతో మస్క్ ఎన్నెన్నో వ్యాపారాలు చేస్తున్నాడు. జనానికి డబ్బు ఆశ చూపించి బకరాలను చేస్తున్నాడు. మస్క్ ఇంత చేసినప్పటికీ.. మాయాజాలాన్ని ప్రదర్శించినప్పటికీ జనం ఎందుకు అతని మీద తిరగబడటం లేదంటే.. ట్విట్టర్ ఎక్స్ అనేది ఒక వ్యసనం అయిపోయింది. అందువల్లే మస్క్ చెప్పినట్టు యూజర్లు ఆడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular