ఏపీలో 49 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత.. కారణమేమిటంటే..?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి సంవత్సరం చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. ఇలా తక్కువ సంఖ్యలో అడ్మిషన్లు జరుగుతున్న కాలేజీల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 25 శాతం కన్నా తక్కువగా అడ్మిషన్లు ఉన్న కాలేజీలను మూసివేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. జగన్ సర్కార్ రాష్ట్రంలోని 49 ఇంజనీరింగ్, 2 బీఫార్మసీ […]

Written By: Kusuma Aggunna, Updated On : November 12, 2020 9:06 am
Follow us on


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి సంవత్సరం చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. ఇలా తక్కువ సంఖ్యలో అడ్మిషన్లు జరుగుతున్న కాలేజీల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 25 శాతం కన్నా తక్కువగా అడ్మిషన్లు ఉన్న కాలేజీలను మూసివేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది.

జగన్ సర్కార్ రాష్ట్రంలోని 49 ఇంజనీరింగ్, 2 బీఫార్మసీ కాలేజీలను ఈ సంవత్సరం మూసివేయనుందని తెలుస్తోంది. మరికొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్ల సంఖ్యలో కోత విధించడానికి సిద్ధమవుతోంది. వర్సిటీల ప్రతిపాదనల మేరకు జగన్ సర్కార్ ఇంజనీరింగ్ కాలేజీల మూసివేత, సీట్ల కుదింపు దిశగా అడుగులు వేస్తోంది. జగన్ సర్కార్ ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల విషయంలో కోత విధిస్తే 17,700 సీట్లకు కోత పడనుందని సమాచారం.

జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలో 26 కాలేజీలు, జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో 23 కాలేజీలు మూసివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలోని కాలేజీల్లో 4,812 సీట్లు తగ్గనుండగా జేఎన్‌టీయూ అనంతపురంలో 5,100 సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంటర్ చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

విద్యార్థులు ప్రస్తుతం భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్న కొత్త బ్రాంచీల వైపు అడుగులు వేస్తూ ఉండటంతో ఏఐ, ఐఓటీ, రోబోటిక్స్, డేటా సైన్సెస్ లాంటి కోర్సులకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. పలు ఇంజనీరింగ్ కాలేజీలు డిమాండ్ కు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ విద్యార్థులను ఆకర్షిస్తూ ఉండటం గమనార్హం.