https://oktelugu.com/

Mahesh : మహేష్.. రాజమౌళి తర్వాత సుకుమార్ తోనే !

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తోన్న సినిమా ‘సర్కారు వారి పాట’. అయితే, మొన్న ఈ సినిమా సెట్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కనిపించాడు. మహేష్ బాబును ప్రత్యేకంగా కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టాడు. ఉన్నట్టు ఉండి సుకుమార్, మహేష్ ను ఎందుకు కలిసినట్టు ? సహజంగా సినిమా షూటింగ్ లో అనుకోకుండా కలుస్తూ ఉంటారు. కానీ, సుకుమార్ – మహేష్ మీటింగ్ చాలా ప్లాన్డ్ గా జరిగింది. మరి సుకుమార్ మహేష్ బాబుని […]

Written By:
  • admin
  • , Updated On : August 14, 2021 / 10:49 AM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తోన్న సినిమా ‘సర్కారు వారి పాట’. అయితే, మొన్న ఈ సినిమా సెట్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కనిపించాడు. మహేష్ బాబును ప్రత్యేకంగా కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టాడు. ఉన్నట్టు ఉండి సుకుమార్, మహేష్ ను ఎందుకు కలిసినట్టు ? సహజంగా సినిమా షూటింగ్ లో అనుకోకుండా కలుస్తూ ఉంటారు. కానీ, సుకుమార్ – మహేష్ మీటింగ్ చాలా ప్లాన్డ్ గా జరిగింది.

    మరి సుకుమార్ మహేష్ బాబుని ఎందుకు వెళ్ళి కలిశారు ? అనేది ఇప్పుడు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వీరి కాంబినేషన్ లో మరో సినిమా రానుందా ? నిజానికి ఒకప్పుడు మహేష్ బాబు – సుకుమార్ కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారు. కానీ, సినిమా కుదరలేదు. ఏడాదిపాటు సుకుమార్ కథ పై కూర్చున్నాడు. మహేష్ కూడా పలుమార్లు కథ విని వర్క్ చేయమంటూ చాల ల్యాగ్ చేశాడు.

    పైగా ఏడాది తర్వాత తీరిగ్గా కథ నచ్చలేదు, నేను ఈ సినిమా చేయలేను అంటూ సుకుమార్ కి హ్యాండ్ ఇచ్చాడు మహేష్. కాకపోతే వీరి మధ్య ఉన్న మంచి స్నేహం చెడిపోలేదు. ఆ స్నేహం అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. తన సినిమాని మహేష్ రిజెక్ట్ చేసినా.. సుకుమార్ మాత్రం మహేష్ కోసం మరో కథను సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నాడు.

    తాజాగా కలిసింది కూడా.. తానూ చేయబోతున్న కథకు సంబంధించిన ఆలోచనను చెప్పడానికేనట. కాకపోతే వీరి కలయికలో సినిమా అనేది ఇప్పట్లో కష్టమే. ఎందుకంటే.. మహేష్ తన తర్వాత సినిమాలను త్రివిక్రమ్, అండ్ రాజమౌళితో చేయబోతున్నాడు. ఆ సినిమాల తర్వాత మహేష్ రేంజ్ మారిపోవచ్చు. అప్పుడు లెక్కలను బట్టి సినిమా ఉంటుంది.

    అయితే సుకుమార్ కూడా పుష్పతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు కాబట్టి.. సుకుమార్ కి హిట్ వస్తే.. రాజమౌళి తర్వాత మహేష్, సుకుమార్ తో సినిమా చేసే అవకాశం ఉంది. ఇక గతంలో వీరి కలయికలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు.