https://oktelugu.com/

AP jobs: ఏపీ డీఎంఈ విభాగంలో 326 ఉద్యోగాలు.. భారీ వేతనంతో?

AP jobs:  ఏపీ ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డైరెక్ట్, లేటరల్‌ ఎంట్రీ విధానంలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 326 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీలను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 1, 2021 / 08:53 AM IST
    Follow us on

    AP jobs:  ఏపీ ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డైరెక్ట్, లేటరల్‌ ఎంట్రీ విధానంలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 326 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

    AP jobs

    డిసెంబర్ నెల 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://dme.ap.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 326 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగ ఖాళీలలో డైరెక్ట్ 188 ఉద్యోగ ఖాళీలు, లేటరల్ ఎంట్రీ 138 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌/డీఎన్‌బీ /ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    Also Read: ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో జాబ్స్.. మంచి వేతనంతో?

    సీనియర్‌ రెసిడెన్సీ ఉన్నవాళ్లు క్లినికల్ స్పెషలైజేషన్స్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2021 సంవత్సరం నవంబర్ నెల 23వ తేదీ నాటికి 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 92,000 రూపాయల వేతనం లభించనుంది. పీజీ డిగ్రీ/సూపర్‌ స్పెషాలిటీ పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://dme.ap.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

    Also Read: ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. భారీ వేతనంతో?