Pan card: ప్రస్తుత కాలంలో చిన్న పని నుంచి పెద్ద పని వరకు పాన్ కార్డ్, పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్ ఎంతో తప్పనిసరి అయ్యాయి. ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు జరగాలన్నా పాన్ కార్డ్ ఎంతో ముఖ్యం. అందుకే మనిషి బ్రతికి ఉన్నప్పుడు తప్పనిసరిగా పాన్ కార్డు ఆధార్ కార్డు పాస్ పోర్ట్ వంటివి ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ప్రతి ఒక్క మనిషికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత పాన్ కార్డు ఓటర్ ఐడీ కూడా వస్తాయి. ఇలా ఓటర్ ఐడి ఉన్నప్పుడే వారు భారతదేశ పౌరుడిగా గుర్తింపు పొందుతారు. ఏదైనా ఒక పని పూర్తి చేయాలంటే తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది.
చిన్న చిన్న ఆర్థిక లావాదేవీల నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినా లేదంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనకు అందాలన్న ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే మనిషి బ్రతికున్నప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ డాక్యుమెంట్స్ మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాయి.మనిషి చనిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ ను ఏం చేస్తారనే విషయాలు చాలా మందికి తెలియవు.
Also Read: చాణక్య నీతి: ఈ పనులు చేయకపోతే మీ శత్రువులకు బలమిచ్చినవారవుతారు.. తక్షణం ఇలా మారండి
ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి సంబంధించిన పాన్ కార్డ్, పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి వంటి ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్లను ఎంత భద్రంగా ఉంచాలి. మనిషి చనిపోయారని వాటిని ఎక్కడ పడితే అక్కడ పడవేస్తే వాటితో ఇతరులు ఎన్నో అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. కనుక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తికి సంబంధించిన విలువైన డాక్యుమెంట్లను భద్రపరచాలి.
ఇక మనిషి చనిపోయిన తరువాత పాస్ పోర్ట్ పరిమిత కాలం పూర్తయిన తర్వాత దానిని పునరుద్ధరించకపోతే పాస్ పోర్ట్ పని చేయదు. అదేవిధంగా చనిపోయిన వ్యక్తి ఓటర్ ఐడి కార్డు రద్దు చేయాలనుకుంటే ఎన్నికల కార్యాలయానికి వెళ్లి ఫారం 7 ఇవ్వటంతో ఓటర్ ఐడి రద్దు అవుతుంది.ఇలా వీటిని రద్దు చేసుకోవడం లేదా జాగ్రత్త పరచుకోవడం చేయాలి లేదంటే ఆ వ్యక్తి చనిపోయిన కొందరు అతనికి సంబంధించిన డాక్యుమెంట్లతో అక్రమాలు చేస్తూ ఉంటారు.
Also Read: LIC Jeevan Shiromani: అదిరిపోయే ఎల్ఐసీ పాలసీ.. నాలుగేళ్లు ప్రీమియం.. మెచ్యూరిటీపై రూ.కోటి!