Jobs: సెంట్రల్ బ్యాంకులో 214 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Jobs: దేశంలో చాలామంది ఉద్యోగులు బ్యాంక్ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే బ్యాంక్ జాబ్ పై ఆసక్తి ఉన్నవాళ్లకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు అందించింది. 214 స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. గతంలో 115 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన ఈ సంస్థ దరఖాస్తు గడువును కూడా అంతకంతకూ పొడిగిస్తుండటం గమనార్హం. 2021 సంవత్సరం డిసెంబర్ 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు […]

Written By: Kusuma Aggunna, Updated On : December 19, 2021 10:16 am
Follow us on

Jobs: దేశంలో చాలామంది ఉద్యోగులు బ్యాంక్ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే బ్యాంక్ జాబ్ పై ఆసక్తి ఉన్నవాళ్లకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు అందించింది. 214 స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. గతంలో 115 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన ఈ సంస్థ దరఖాస్తు గడువును కూడా అంతకంతకూ పొడిగిస్తుండటం గమనార్హం.

2021 సంవత్సరం డిసెంబర్ 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని గతం ఈ సంస్థ ప్రకటించింది. అయితే నిరుద్యోగుల అభ్యర్థన మేరకు తాజాగా ఈ సంస్థ దరఖాస్తు గడువును 2021 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ వరకు పెంచింది. 2022 సంవత్సరం జనవరి 11వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన కాల్ లెటర్స్ ను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

2022 సంవత్సరం జనవరి 22వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఆన్ లైన్ ఎగ్జామినేషన్ ను నిర్వహిస్తారు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 175 రూపాయలుగా ఉందని తెలుస్తోంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://ibpsonline.ibps.in/cbiosvsnov21/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

centralbankofindia.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.