Bhuma Akhila Priya: తెలుగుదేశం పార్టీలో నేతలు క్రమంగా దూరం అవుతున్నారు. చంద్రబాబు విధానాలతోనే వారు పార్టీకి అంటనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అపర చాణుక్యుడిగా పేరున్న చంద్రబాబు కొన్ని విషయాల్లో మాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పార్టీలో అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో కొందరు నేతలను కావాలనే దూరం చేసుకుంటున్నట్లు సమాచారం. పార్టీలో చురుకుగా ఉండే భూమా అఖిలప్రియ ఈ మధ్య స్తబ్దుగా ఉన్నారు.దానికి కూడా కారణాలు లేకపోలేదు. చంద్రబాబు తీరుతోనే ఆమె సైలంట్ అయిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వైసీపీ నేతల విమర్శలకు అఖిలప్రియ స్పందించలేదు. చంద్రబాబు కంట నీరు పెట్టుకున్నా ఓదార్చలేదు. దీంతో ఆమె పార్టీతో సంబంధాలు తెంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు తీరుతోనే ఆమె మౌనం వహిస్తోందనే తెలుస్తోంది. దీంతో నేతలను క్రమంగా దూరం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Also Read: టీడీపీ పొత్తుల వ్యవహారం వైసీపీలోనే హాట్ టాపిక్.. ఎందుకంటే..?
టీడీపీ కార్యాలయాలపై కూడా జరిగిన దాడిలో చంద్రబాబు చేసిన దీక్షలకు కూడా అఖిలప్రియ హాజరు కాలేదు. చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడికి కూడా అఖిలప్రియ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆమె పార్టీని దాదాపు వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలతో నేతలను దూరం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
అయితే గతంలో ఓ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్టు అయితే చంద్రబాబు కనీసం పట్టించుకోలేదు. అండగా నిలవలేదు. దీంతో ఆమె ఆగ్రహంతో తనకు జరిగిన దానికి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో బాధపడిన అఖిలప్రియ టీడీపీని లెక్కచేయడం లేదని తెలుస్తోంది. పైగా వచ్చే ఎన్నికల్లో తన కుటుంబానికి టికెట్ ఇవ్వాలని కోరినా ఒక ఆళ్లగడ్డ టికెట్ ఒకటే ఇచ్చేందుకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అఖిలప్రియ కోపంతో పార్టీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
Also Read: అమరావతి ఒక్కటే రాజధాని.. చంద్రబాబుతో కాదు.. జగన్ కానీయడు.. మరెట్లా?