https://oktelugu.com/

Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 1925 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Jobs:  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేన్‌మెంట్‌ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 1,925 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో మహిళా స్టాఫ్ నర్స్ ఉద్యోగ ఖాళీలు 82, అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగ ఖాళీలు 7, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 10, ఆడిట్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 11, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 16, 2022 / 09:23 AM IST
    Follow us on

    Jobs:  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేన్‌మెంట్‌ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 1,925 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో మహిళా స్టాఫ్ నర్స్ ఉద్యోగ ఖాళీలు 82, అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగ ఖాళీలు 7, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 10, ఆడిట్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 11, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి.

    జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 630, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీ 1, స్టెనోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు 22, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలు 4, క్యాటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 87 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ ఉద్యోగ ఖాళీలు 273, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగ ఖాళీలు 142, మెస్ హెల్పర్ ఉద్యోగ ఖాళీలు 629, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 23 ఉన్నాయి.

    navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ‘వాట్స్‌ న్యూ’ విభాగంలో నాన్ టీచింగ్ పోస్టుల లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ ను పూరించి ఉద్యోగ ఖాళీలకు అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

    ఆ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించి అప్లికేషన్ ఫారమ్ ను సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (cbt), ఇంటర్వ్యూ (సివిల్) ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.