Bipin Rawat: సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై నిజాలు బయట పెట్టారు. ప్రమాదానికి గల కారణాలపై త్రివిధ దళాల కోర్టు ఆప్ ఎంక్వైరీ నివేదికను బయటపెట్టింది. ప్రమాదంలో కుట్రలకు తావులేదని తేల్చింది. సాంకేతిక కారణాలతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని వెల్లడించింది. వాతావరణంలో వచ్చిన మార్పులే హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలు అయ్యాయని సూచించింది. దీనిపై ఎవరికి అనుమానాలు అక్కర్లేదని తెలిపింది.
సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ సహా 14 మంది మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై నిజాలు తెలిశాయి. జనవరి 5న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారణలో వెల్లడైన విషయాలు తెలియజేశారు. హెలికాప్టర్ కూలే సమయానికి పైలెట్ ఆధీనంలోనే ఉందని తెలుస్తోంది. డిసెంబర్ 8న జరిగిన ఈ సంఘటనతో దేశం ఉలిక్కిపడింది.
Also Read: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. క్రికెట్ అభిమానులకు కోలుకోలేని షాక్
ప్రమాదంలో మెకానికల్ వైఫల్యం, కుట్ర, నిర్లక్ష్యం కారణాలు కావని తెలుస్తోంది. వాతావరణ ప్రభావమే ప్రమాదానికి మూల కారణమైంది. మేఘాల కారణంగానే పైలెట్ కంగారు పడి హెలికాప్టర్ అదుపు తప్పేందుకు కారణమయ్యాడు. అంతే కానీ ఇందులో ఎలాంటి కుట్రలకు తావులేదని తెలుస్తోంది. దీంతో హెలికాప్టర్ ప్రమాదంపై ఎవరిలో అనుమానాలు అక్కర్లేదని తెలిపింది.
ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లను పరిశీలించారు. వాటి ఫలితాల ఆధారంగానే కోర్టు ఆఫ్ ఎంక్వైరీ సిఫారసులు చేసింది. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలోని ట్రై సర్వీసెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రమాదానికి గల కారణాలు విశ్లేషించింది. తమిళనాడులోని కూనూరు సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్ పూర్తిగా పైలెట్ ఆధీనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి ముందు హెలికాప్టర్ తక్కువ దూరంలోనే ఎగురుతున్నా మేఘాలు అడ్డు వచ్చినట్లు సమాచారం. దీంతో పైలెట్ సరిగా అంచనా వేయలేక ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం ఈమేరకు నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
Also Read: ఇంటి ముందర ముగ్గులు వేయడానికి గల కారణాలివే..