బ్రహ్మపుత్ర వాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 17 వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన శిక్షణ వ్యవధి 12 నెలలుగా ఉండనుందని సమాచారం. 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.
పదో తరగతి, ఐటీఐలో సాధించిన అర్హత మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను పంపి అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ నెల 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
www.bvfcl.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు భారీగా లాభాలు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఉద్యోగులకు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత భారీ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల అర్హత ఉన్న నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.