Jobs: కరెన్సీ నోట్‌ ప్రెస్‌లో 149 ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

Jobs: ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి. తాజాగా కరెన్సీ నోట్‌ ప్రెస్‌ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఈ సంస్థ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని తెలుస్తోంది. ఈ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కు సంబంధించిన సంస్థ కావడం గమనార్హం. మొత్తం 149 ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగ […]

Written By: Kusuma Aggunna, Updated On : January 9, 2022 8:08 am
Follow us on

Jobs: ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి. తాజాగా కరెన్సీ నోట్‌ ప్రెస్‌ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఈ సంస్థ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని తెలుస్తోంది. ఈ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కు సంబంధించిన సంస్థ కావడం గమనార్హం. మొత్తం 149 ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్లు, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, సూపర్ వైజర్లు, వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు మాస్టర్స్ డిగ్రీతో, డిగ్రీ, డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేవాళ్లకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ కు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ట్రేడులతో పాటు ప్రింటింగ్, మెకానికల్, ఎయిర్‌ కండిషనింగ్ పాసైన వాళ్లు అర్హులని చెప్పవచ్చు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ కు ఏదైనా డిగ్రీ 55 శాతం మార్కులతో పాసైన వాళ్లు అర్హులు కాగా 18 నుంచి 28 శాతం మధ్య వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలి.

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు టైపింగ్ స్పీడ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ కు దరఖాస్తు చేసుకునే వాళ్లకు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, స్టెనోగ్రఫీ ఉండాలి. సూపర్ వైజర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్లు మాస్టర్స్ డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి.

18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా https://cnpnashik.spmcil.com/interface/home.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం జనవరి 25వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.