crompton pumps
Crompton Pumps : టెక్నాలజీ మారుతోంది. అత్యాధునిక టెక్నాలజీ మన దరి చేరుతోంది. దీంతో మన పనులన్నీ సులువుగా మారిపోతున్నాయి. తాజాగా పంప్ సెట్ మోటార్ సంస్థ ‘క్రాంప్టన్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రత్యేకమైన హై-ఫ్లో మ్యాక్స్ * టెక్నాలజీతో వేగవంతమైన వాటర్-ట్యాంక్ ఫిల్లింగ్ను అందించే క్రాంప్టన్ ఉత్పాదన మినీ మాస్టర్ ప్లస్ పంప్ ను ఆవిష్కరించింది.
నాణ్యత, విశ్వసనీయత, ఆవిష్కరణలతో విశ్వసనీయమైన వారసత్వాన్ని కలిగిన బ్రాండ్, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ప్రత్యేకమైన హై-ఫ్లో మ్యాక్స్* టెక్నాలజీతో కూడిన మినీ మాస్టర్ ప్లస్ పంప్‌ను ప్రారంభించింది. తాజా ఉత్పాదన అనేక వినూత్న ఫీచర్లతో వస్తుంది. నీటిని పంపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది, తద్వారా సగం సమయంలో వేగంగా వాటర్ ట్యాంక్ నింపేలా చేస్తుంది.
నేడు వినియోగదారులు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో మరింత సమాచారం, అవగాహనతో ఉంటున్నారు. భారతీయ కుటుంబాలలో, ప్రత్యేకించి ఉమ్మడి కుటుంబాలలో నివ సించేవారు లేదా బహుళ అంతస్తుల బంగ్లాలలో నివసించేవారు, ట్యాంక్ నింపడంలో చాలా అసౌకర్యాలకు గురవుతుంటారు. అందుకు గణనీయమైన సమయం పడుతుంది. పంపులు వేగంగా నీటి ప్రవాహాన్ని సర ఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి, వేగంగా ట్యాంక్ నిండేలా చేస్తాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని, క్రాం ప్టన్ తన ఉత్పాదన మినీ మాస్టర్ ప్లస్ పంప్‌తో వేగంగా ట్యాంక్ నింపడాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లింది. సాంకేతికంగా ఉన్నతమైన పంపుల విస్తృత ఉత్పత్తి శ్రేణి వినియోగదారులకు తక్కువ నిర్వహణ ఖర్చులు, అధిక మన్నిక, పనితీరు, డబ్బుకు విలువ, తక్కువ శక్తి వినియోగం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.
క్రాంప్టన్ మినీ మాస్టర్ ప్లస్ పంప్ వాల్యూట్ కేసింగ్, అడాప్టర్ వంటి కీలకమైన భాగాలపై స్టెయిన్లెస్-స్టీల్ షీట్ (ఎస్ఎస్)తో సహా అధునాతన ఫీచర్లను కలిగి ఉంది, ఇది తుప్పు పట్టకుండా చేస్తుంది. అవాంతరాలు లేని ఆపరేషన్‌ను అందిస్తుంది. ఇది జామింగ్ లేదా పంప్ వైఫల్యం వంటి సమస్యలను నిర్ధారిస్తుంది, తద్వారా నీటి సాఫీగా ప్రవహిస్తుంది. అంతేకాకుండా, దీని నిర్మాణం పంపుల హైడ్రాలిక్స్ ను ప్రభావితం చేస్తుంది, తద్వారా అధిక నీటి ఉత్పత్తిని, మెరుగైన పనితీరును అందిస్తుంది.
-వేగంగా ట్యాంక్ నింపడంలో తిరుగు లేని వినియోగదారు అనుభవాన్ని సృష్టించడంలో సహాయపడే 4 ముఖ్య లక్షణాలు
– పెద్ద ఇంపెల్లర్ పరిమాణం: నీటి సరఫరా 120% నుండి 200% పెరుగుతుంది, 35%-50% పెద్ద ఇంపెల్లర్ పరిమాణం కారణంగా ట్యాంక్ నింపే సమయం 50% నుండి 60% వరకు తగ్గుతుంది.
– శక్తివంతమైన మోటార్: పెద్ద స్టాంపింగ్, సమర్థవంతమైన డిజైన్‌తో కూడిన శక్తివంతమైన మోటా రు 60 నుండి 100% ఎక్కువ శక్తిని అందిస్తుంది, ఇది వేగంగా ట్యాంక్ నింపడంలో సహాయపడు తుంది.
– ప్రత్యేక హైడ్రాలిక్ డిజైన్ – హైబ్రిడ్ పంప్ (SS ఇన్సర్ట్తో) సక్షన్ ఏరియా, ఫ్లో ఏరియాతో సహా హైడ్రాలిక్ ప్రవాహ మార్గం యొక్క ప్రత్యేక డిజైన్ ఫలితంగా తక్కువ ఘర్షణ (నీటి ప్రవాహ నష్టం)తో స్థిరంగా అధిక నీటి విడుదలను అందించడంలో సహాయపడుతుంది.
– వారంటీ – రెట్టింపు వారంటీ – 24 నెలలు ఉత్పత్తి ద్వారా అందించబడుతున్న పనితీరు నాణ్యతను నొక్కి చెబుతుంది
క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ (పంప్స్) రజత్ చోప్రా తమ ఫ్లాగ్షిప్ ఉత్పత్తి గురించి మాట్లాడుతూ “క్రాంప్టన్ మా వినియోగదారుల జీవితానికి విలువను జోడించే ఆవి ష్కరణలను నిలకడగా అందించింది. ఎంతో ముఖ్యమైన వినియోగాల కోసం నిరంతరాయ ప్రవాహాన్ని నిర్ధా రిస్తూ, నీటిని పంపిణీ చేయడంలో పంపులు కీలకంగా ఉంటాయి. మా వినియోగదారు కేంద్రీకృత డిజైన్ విధా నంతో, మా ఫ్లాగ్షిప్ సిరీస్‌లో దీర్ఘకాలిక నాణ్యత, ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ప్రతి అవసరానికి అర్ధవంత మైన పరిష్కారాలను అందించే బ్రాండ్‌గా, పంప్ ఫిల్లింగ్ సమయాన్ని, ప్రయత్నాన్ని గణనీయంగా తగ్గించ డంలో, వినియోగదారు అనుభవ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడటానికి మా ప్రయత్నం ఇది’’ అని అన్నారు.
-క్రాంప్టన్ గురించి
80+ ఏళ్ళ బ్రాండ్ వారసత్వంతో, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఫ్యాన్లు, రెసిడెన్షియల్ పంప్స్ లో భారతదేశ అగ్రగామి సంస్థల్లో ఒకటి. ఏళ్ళుగా ఈ సంస్థ ఆధునిక వినియోగదారు అవసరాలను తీర్చే వినూత్న వస్తువులను విస్తృత శ్రేణిలో అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. వాటర్ హీటర్లు, యాంటీ డస్ట్ ఫ్యాన్స్, యాంటీ బాక్టీరియల్ ఎల్ఈడీ బల్బు లతో పాటుగా ఇతర శ్రేణులకు చెందిన ఎయిర్ కూలర్లు, మిక్సర్ గ్రైండర్స్ లాంటి ఫుడ్ ప్రాసెసర్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్, ఇస్త్రీ పెట్టె లాంటివి వీటిలో ఉన్నాయి. బ్రాండ్ మరియు వినూత్నతలో కంపెనీ మరింతగా ఇన్వెస్ట్ చేస్తోంది. వినూత్నత అనేది వినియోగదారుల అవ సరాలను తీర్చడం మాత్రమే గాకుండా అది శక్తి ఆదాను పెంచేదిగా కూడా ఉంటోంది. ఈ కన్జ్యూమర్ బిజినెస్ సంస్థ దేశవ్యాప్తంగా పటిష్ఠ డీలర్ వ్యవస్థతో విస్తృత సర్వీస్ నెట్ వర్క్ కలిగి సమర్థంగా విక్రయానంతర సేవలను వినియోగదారులకు అందించగ లుగుతోంది.
శక్తిసామర్థ్య ఉత్పాదనలను అభివృద్ధి చేసే దిశలో నిరంతరం పని చేస్తున్నఈ కంపెనీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషి యెన్సీ (బీఈఈ), విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మోస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లియెన్సెస్ ఆఫ్ ది ఇయర్ 2019లో నేషనల్ ఎనర్జీ కన్జ్యూమర్ అవార్డ్స్ (ఎన్ఈసీఏ) ను గెలుపొందింది. సీలింగ్ ఫ్యాన్లలో దీని హెచ్ ఎస్ ప్లస్ మోడల్ కు మరియు ఎల్ఈడీ బల్బ్ విభాగంలో దీని తొమ్మిది వాట్ల ఎల్ఈడీ బల్బ్ కు ఈ అవార్డులు లభించాయి. డబ్ల్యూపీపీ అండ్ కంటార్ విడుదల చేసిన బ్రాండ్స్ టాప్ 75 మోస్ట్ వాల్యుబుల్ ఇండి యన్ బ్రాండ్స్ లిస్ట్ (2020)లో ఈ కంపెనీ స్థానం సంపాదించింది. అంతేగాకుండా హెరాల్డ్ గ్లోబల్, బీఏఆర్సీ ఏషియాలచే కన్జ్యూమర్ ఎలక్ట్రికల్ విభాగంలో బ్రాండ్ ఆఫ్ ది డికేడ్ 2021గా గుర్తించబడింది. కాంప్రాన్ గురించిన మరింత సమాచారం కోసం మెడిసాన్ పీఆర్.. మెరిల్లే రెమెడిస్ 9920976599 లో సంప్రదించవచ్చు. ఇక పూర్తి సమాచారం.. marielle.remedios@madisonpr.in వెబ్ సైట్ లో పొందుపరిచారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Crompton pumps that pump water fast with latest technology
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com