Telangana YouTuber arrest: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. అది కూడా ఒక ఆదాయ మార్గం అయిన తర్వాత.. అందులో ఫేమస్ అయ్యేందుకు చాలామంది తిక్క తిక్క ప్రయత్నాలు చేస్తున్నారు. ఒరిజినల్ కంటెంట్ తో ఆకట్టుకోవాల్సింది పోయి.. తల తిక్క వీడియోలతో పరువు తీసుకుంటున్నారు. చివరికి జైలు పాలవుతున్నారు. ఇప్పుడు మీరు చదవబోయే కథనం కూడా అటువంటిదే. ఇందులో ఓ యూట్యూబర్ ఫేమస్ అయ్యేందుకు భారతదేశ చరిత్రలో ఎవరూ చేయని దుర్మార్గానికి పాల్పడ్డాడు. దానిని వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఫలితంగా ఆ విషయం కాస్త చర్చానీయాంశమైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదివేయండి..
రాజన్న సిరిసిల్ల చెందిన కో యూట్యూబర్.. వంటల వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాడు. అయితే రాత్రికి రాత్రే ఫేమస్ కావాలి అనేది ఇతడి ఆశయం. ఈ క్రమంలో కుకింగ్ వీడియోలలో జాతీయ పక్షిని చంపి.. దాని కూరను వండాడు. ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. పైగా దీనికి సంప్రదాయ జాతీయ పక్షి కూర ఎలా వండాలో మీకు తెలుసా అంటూ థంబ్ నెయిల్ కూడా రూపొందించాడు. ఆ తర్వాత కూర వండి.. “సంప్రదాయ జాతీయ పక్షి రెసిపీ” అంటూ గొప్పలు పోయాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో సర్కులేట్ అవ్వడంతో.. ఆ విషయం అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది.
దీంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. అతడిని విచారించారు. మరో వీడియోలో అడవి పంది కూర వండే విధానాన్ని ఆ యూట్యూబర్ యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టు తెలుస్తోంది. అటు జాతీయ పక్షి, ఇటు అడవి పంది రెండు కూడా అరుదైన వన్యప్రాణులు కాబట్టి.. ఇలా వాటిని హతమార్చి వండడం చట్టరీత్యా నేరం కాబట్టి.. అటవీ శాఖ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంటిని పరిశీలించారు. ఆ పరిశీలనలో ఏం స్వాధీనం చేసుకున్నారో బయటకు మాత్రం చెప్పడం లేదు..” జాతీయపక్షిని వేటాడటం.. అడవి పందిని కూడా హతమార్చడం నేరం. అలాంటి వాటికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల చెందిన యూట్యూబర్ పై వన్యప్రాణి సంరక్షకులు మాకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నాం. తదుపరి విచారణ సాగుతుంది కాబట్టి ఇప్పటికీ మేము ఏమి చెప్పలేమని” పోలీసులు పేర్కొన్నారు. అయితే జాతీయ పక్షి కూడా తాను వండలేదని, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు తాను ఈ పని చేసినట్టు ఆ యూట్యూబర్ పేర్కొన్నాడు. మరోవైపు అడవి పంది మాంసం ఎక్కడ దొరికిందనే ప్రశ్నకు అతడు సమాధానం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఈ యూట్యూబర్ చేసిన వంటల ప్రయోగం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఒకవేళ జాతీయ పక్షిని చంపినట్టు తేలితే.. అతడి పై పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా, గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడిన కొంతమందిపై అటవీ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. వారు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ తర్వాత వన్యప్రాణి సంరక్షణ చట్టానికి ప్రభుత్వం మరింత పదును పెట్టింది. వన్య ప్రాణులను, జాతీయ పక్షిని హతమార్చితే కఠిన చర్యలు తీసుకునే లాగా చట్టాలను రూపొందించింది. ఈ లెక్కన రాజన్న సిరిసిల్ల యూట్యూబర్ నేరం చేసినట్టు నిరూపణ అయితే కఠిన శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More