Homeబిజినెస్Bharat Mobility Global Expo 2025: ఆటో ఎక్స్‌పో అందరికీ ఉచితం.. పాస్ ఎలా...

Bharat Mobility Global Expo 2025: ఆటో ఎక్స్‌పో అందరికీ ఉచితం.. పాస్ ఎలా పొందాలో తెలుసా ?

Bharat Mobility Global Expo 2025: ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 జనవరి 17 నుండి జనవరి 22, 2025 వరకు ఢిల్లీలో జరగనుంది. గతంలో దీనిని ఆటో ఎక్స్‌పో అని పిలిచేవారు. ఈ ప్రధాన కార్యక్రమంలో అనేక వాహన తయారీదారులు కాన్సెప్ట్, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడళ్లను ఆవిష్కరించడం, ప్రదర్శించడం, ప్రారంభించడం జరుగుతుంది. మారుతి సుజుకి ఇ విటారా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా సియెర్రా ఇవి, విన్‌ఫాస్ట్ ఇవి, మెర్సిడెస్ బెంజ్ జి-వాగన్ ఎలక్ట్రిఫైడ్ వెర్షన్, ఎంజి సైబర్‌స్టర్ రోడ్‌స్టర్, బజాజ్ రెండవ సిఎన్‌జి బైక్ లాంటివి మరెన్నో ఉన్నాయి.

ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో: అంటే ఏమిటి
ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో అనేది దేశంలోని అన్ని మొబిలిటీ సంబంధిత ఎక్స్‌పోల సమ్మిళితం. ఇందులో చాలా ప్రజాదరణ పొందిన ఆటో ఎక్స్‌పో కూడా ఉంది. ఈ సంవత్సరం ఎక్స్ పో థీమ్ ‘బియాండ్ బోర్డర్స్: కో-క్రియేటింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది ఆటోమోటివ్ వాల్యూ చైన్’. దీనిని ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఇండియా (EEPC ఇండియా) వివిధ పరిశ్రమ సంస్థలు, భాగస్వామ్య సంస్థల ఉమ్మడి మద్దతుతో సమన్వయం చేస్తోంది. ఇందులో ACMA, SIAM, ATMA, IESA, ISA, NASSCOM, ICEMA, AICMA, MRAI, ITPO, ఇన్వెస్ట్ ఇండియా, IBEF, CII, యశోభూమి, IEML ఉన్నాయి.

ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో: ఎక్కడ జరుగుతుంది
గ్లోబల్ ఎక్స్‌పోలో వేర్వేరు ప్రదర్శనలకు వేర్వేరు వేదికలు ఉంటాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో ఆటో ఎక్స్‌పో మోటార్ షో, ఇండియా ఇంటర్నేషనల్ టైర్ షో, ఇండియా సైకిల్ షో, ఇండియా బ్యాటరీ షో, స్టీల్ పెవిలియన్, మొబిలిటీ టెక్ పెవిలియన్ నిర్వహించబడతాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్ & మార్ట్‌లో ఇండియా కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ ఎక్స్‌పో, అర్బన్ మొబిలిటీ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షో జరుగుతాయి. ఢిల్లీలోని ద్వారకలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో ఆటో కాంపోనెంట్స్ షో జరుగుతుంది. ఇది 200,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ ప్రదర్శనకు 5,00,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు హాజరవుతారని అంచనా.

టికెట్ వివరాలు
ఎక్స్‌పోను సందర్శించడానికి ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ www.bharat-mobility.com లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా హాజరు కావచ్చు. ఇందులో ఎంట్రీ అంతా ఉచితంగానే ఉంటుంది. అన్ని వివరాలను తనిఖీ చేసిన తర్వాత మీ ఇమెయిల్ IDకి QR- కోడ్ వస్తుంది. అదే మీ ఈవెంట్ పాస్ అవుతుంది. 2025 జనవరి 19 నుండి 22 వరకు సాధారణ ప్రజలకు ప్రవేశం అనుమతించబడుతుంది. జనవరి 17న మీడియా నిపుణులకు మాత్రమే ప్రత్యేక ప్రవేశం ఉంది. జనవరి 18 డీలర్లు, ప్రత్యేక ఆహ్వానాలు ఉన్నవారికి కేటాయించబడింది.

ఎలా చేరుకోవాలి
ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం చేరుకోవాలి. ఇక్కడ అనేక రవాణాకు అనేక ఆఫ్షన్లు అందుబాటులో ఉన్నాయి. సందర్శకులు బ్లూ లైన్ మెట్రోలో సుప్రీంకోర్టు స్టేషన్ చేరుకోవచ్చు. షటిల్ సర్వీసులు వారిని ఎక్కడి నుండి వేదికకు తీసుకెళతాయి. కారులో వేదికకు వెళ్లే వారికి తగిన పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

 

Bharat Mobility Global Expo 2025(1)
Bharat Mobility Global Expo 2025(1)

 

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular