https://oktelugu.com/

Mexico: యాక్సెడెంట్ అయ్యిందే తల్లీ.. మీ సెల్ఫీ పిచ్చి తగలయ్యా..

మెక్సికోలో కారు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో ఐదుగురు యువతులు ఉన్నారు. అందులో ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 23, 2024 / 07:29 PM IST

    Mexico

    Follow us on

    Mexico: ఎదురుగా ప్రమాదం జరిగితే బెంబేలెత్తిపోతాం. పరుగు పరుగున వెళ్లి సహాయం చేస్తాం. క్షతగాత్రులకు సఫర్యలు చేస్తాం. అంబులెన్స్ కు ఫోన్ చేసి అత్యవసరంగా ఆసుపత్రికి పంపిస్తాం. అయితే ఇటీవల ట్రెండ్ మారింది. సహాయానికి బదులు చేత స్మార్ట్ ఫోన్ తో సెల్ఫీలు తీస్తున్నారు. సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ వింత పోకడ ఇటీవల అధికమైంది. అయితే ఓ ప్రమాద బాధితురాలే తనకు తాను సెల్ఫీ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అంబులెన్స్ వచ్చే సమయానికి చేతిలో ఫోన్ పట్టుకుని సెల్ఫీ దిగడం చూసి అక్కడున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మెక్సికోలో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    మెక్సికోలో కారు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో ఐదుగురు యువతులు ఉన్నారు. అందులో ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వస్తుందని రోడ్డుపై కూర్చున్న క్షేత్రగాత్రులు ప్రమాదస్థితిలో కూడా సెల్ఫీ దిగారు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా కంగారు పడిపోయారు.

    అయితే ఈ ఘటనలో ట్విస్ట్ ఏమిటంటే.. కారులో ఉన్న ఐదుగురు యువతులు మద్యం మత్తులో ఉన్నారు. మిగతా ముగ్గురు కారులోనే ఉండిపోయారు. కారు అద్దాలు ధ్వంసం కావడంతో ఇద్దరు యువతులకు గాయాలయ్యాయి. వారి శరీరమంతా రక్తసిక్తం అయ్యింది. అయితే అప్పటికే మద్యం మత్తు వీడకపోవడంతో.. వారు సెల్ఫీలకు దిగడం కనిపించింది. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనిపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అనుచిత కామెంట్లు పెడుతున్నారు.