Homeఎంటర్టైన్మెంట్ఓటీటీOTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసిన, చేయబోతున్న సినిమాల లిస్ట్ ఇదిగో..

OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసిన, చేయబోతున్న సినిమాల లిస్ట్ ఇదిగో..

OTT Movies: కొత్త సినిమాలు వస్తున్నాయంటే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు ప్రేక్షకులు. ఇక కొన్ని సినిమాల గురించి మరింత స్పెషల్ గా ఎదురుచూస్తారు. అందులో ఫేవరేట్ హీరో, హీరోయిన్ అయితే ఆ ఎదురుచూపులు మామూలుగా ఉండవు. ఇక సినిమాలే కాదండోయ్ వెబ్ సిరీస్ ల గురించి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ వారం సందడి చేయడానికి సిద్దమైన ప్రాజెక్టులు ఏంటో ఓ సారి తెలుసుకోండి.

మోహన్ భగత్, సుప్రితా సత్యనారాయణ్ నటించిన ఈ ఆరంభం సినిమా మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. ఇందులో లో మోహన్ భగత్, రవీంద్ర విజయ్ తదితర నటులు మంచి పెర్ఫామెన్స్ లు కనబరిచినా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సుహాన్ ప్రధాన పాత్రలో నటించిన ప్రసన్న వదనం సినిమా రేపు అంటే మే 24 న స్ట్రీమింగ్ కు సిద్దం అయింది. కలర్ ఫోటో నుంచి కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాన్ ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నారు.

విశాల్, ప్రియా భవానీ శంకర్ లు నటించిన రత్నం సినిమా ఆల్ రెడీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఈ రోజు నుంచే అమెజాన్ లో అందుబాటులోకి వచ్చింది. విశాల్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. కానీ ఈ సినిమా విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలో దర్శనం ఇచ్చింది. అజయ్ దేవగన్, ప్రియమణి నటించిన మైదాన్ సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 10న థియేటర్ లలో రిలీజ్ అయినా ఈ స్పోర్ట్స్ డ్రామా బయోపిక్ కు మంచి స్పందన లభించింది.

జాసన్ మోమోయ్, పాట్రిక్ విల్సన్ లు నటించిన ఈ సినిమా కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. జేమ్స్ వాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్ అనే హిట్ మూవీకి కొనసాగింపుగా రావడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అదే రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించింది ఈ హాలీవుడ్ సినిమా. ఇక అట్లాస్ సినిమా కూడా రేపు ఓటీటీలోకి రానుంది. అదే విధంగా ట్రైయింగ్ అనే వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ సీజన్ 4 అనే విషయం తెలిసిందే. మొత్తం మీద ఇవే కాదు మరిన్ని సూపర్ హిట్ వెబ్ సిరీస్ లు, సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రావడానికి సిద్దంగా ఉన్నాయి. మరి సమయం ఉంటే చూసేయండి..

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version