https://oktelugu.com/

Tollywood Collections : ఓజీ, పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాలా కలెక్షన్ల టార్గెట్ ఎంతో తెలుసా..?

ఇక ఈ సినిమాకు సంభందించి గ్లింప్స్ ను రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమా భారీ హైప్ ను అయితే క్రియేట్ చేసుకుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా మరోసారి భారీ సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది...

Written By:
  • NARESH
  • , Updated On : May 23, 2024 / 08:14 PM IST

    OG, Pushpa 2, Game Changer

    Follow us on

    Tollywood Collections : తెలుగు సినిమా స్థాయి అనేది పెరిగిపోయింది. ఒకప్పుడు తెలుగులో మాత్రమే రిలీజ్ చేసే మన సినిమాలను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ ని మించి మన ఇండస్ట్రీ సూపర్ సక్సెస్ గా మారడానికి ముఖ్య కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి నేపథ్యంలో పాన్ ఇండియాలో మన సినిమాలు సత్తా చాటుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఒక మూడు సినిమాలు మాత్రం భారీ వసూళ్లను రాబట్టే అవకాశం అయితే ఉంది. ఇక 1000 కోట్లకు పైన కలెక్షన్లను సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది…

    ఇక అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప 2 సినిమా మీద విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ సినిమాకి ఉన్న భారీ హైప్ వలన ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే పుష్ప 2 సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి…

    ఇక అత్యంత ప్రెస్టేజీయస్ గా తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలను కనక చూసుకుంటే అవి యావరేజ్ టాక్ తెచ్చుకుంటేనే సూపర్ డూపర్ సక్సెస్ సాదిస్తాయి. ఇంకా అలాంటిది సూపర్ సక్సెస్ అయితే మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో ఆయన చేస్తున్న ఓజీ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

    ఇక ఈ సినిమాకు సంభందించి గ్లింప్స్ ను రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమా భారీ హైప్ ను అయితే క్రియేట్ చేసుకుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా మరోసారి భారీ సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది…

    ఇక రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా కూడా భారీ వసూళ్లను రాబట్టే అవకాశలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. ఇక దానికి సంభందించి ఈ సినిమా దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను సాధిస్తుంది అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.