Madhya Pradesh crime incident: నేటి ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలోనే మునిగి తేలుతోంది. సోషల్ మీడియా నే శ్వాసిస్తోంది. సోషల్ మీడియానే ధ్యానిస్తోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నిత్యం సోషల్ మీడియానే జనం ఫాలో అవుతున్నారు. తినే తిండి నుంచి మొదలుపెడితే తిరిగే ప్రాంతం వరకు ప్రతిదీ అందులోనే పంచుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా అనేది ఒక వ్యసనం లాగా చాలామందికి మారిపోయింది. ఇది ఎక్కడ దాకా దారి తీస్తుంది? ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది? అనే విషయాలపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
సోషల్ మీడియాను నమ్ముకుని చాలామంది సెలబ్రిటీలు అవుతున్నారు. అలాంటి సెలబ్రిటీలకు చాలా కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. ఎండార్స్మెంట్ లు కుదుర్చుకొని ప్రకటనలు రూపొందిస్తున్నాయి . సోషల్ మీడియాలో ఉన్న రీచ్ ఆధారంగా సెలబ్రిటీలకు కంపెనీలు ఆదాయాన్ని కల్పిస్తుంటాయి. ఇంతటి ఆదాయం వస్తుంది కాబట్టి చాలామంది సోషల్ మీడియాలో పాపులర్ అవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది రీల్స్ ద్వారా.. ఇంకా కొంతమంది వీడియోల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఇందులో కొంతమంది మాత్రం ఓవర్ నైట్ సెలబ్రిటీలు కావడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. అలాంటి వారు చేస్తున్న పనులు తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తున్నాయి. సభ్య సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం, లైక్స్, షేర్లు పెంచుకోవడానికి కొందరైతే అసాంఘిక కార్యకలాపాలకు తెగిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రాంతంలో ఇటువంటి దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి ముగ్గురు అమ్మాయిలు ఒక గ్యాంగ్ మాదిరిగా ఏర్పడ్డారు. అంతేకాదు ఇద్దరి యువతులను కత్తితో బెదిరించి అపహరించారు. వారిని బంధించి విచక్షణ రహితంగా కొట్టారు. ఆ తర్వాత వారిని కొడుతున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త ఒక్కసారిగా వైరల్ అయింది. అయితే వారి బారి నుంచి తప్పించుకున్న ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె చెప్పిన ఆధారాల ప్రకారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ మహిళా గ్యాంగును అరెస్ట్ చేశారు. అయితే ఆ ముగ్గురు మహిళలు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి ఇంతటి దారుణాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్ కు తరలించారు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు ప్రధాన మీడియాలో ప్రసారం కావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో పాపులర్ రావడానికి ముగ్గురు మహిళలు ఇంతటి దారుణానికి పాల్పడడం నిజంగా క్షమించరాని నేరమని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరుతున్నారు.
STORY | Woman held, two minors detained for abducting, assaulting teen in MP’s Jabalpur
A 25-year-old woman was arrested and two girls detained for allegedly abducting a teenager, assaulting her and uploading her video on social media in Madhya Pradesh’s Jabalpur, police said on… pic.twitter.com/QunJEd0G8V
— Press Trust of India (@PTI_News) November 23, 2025