Woman Commits Suicide: అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం మండలం. ఈ మండలంలో ఇటీవల గురువారం ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పైగా ఆమె ఎనిమిది నెలల గర్భిణి. 8 నెలల గర్భిణిగా ఉన్న ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనుక భర్త ఉన్నాడని అందరూ అనుకున్నారు. పోలీసులు కూడా అతడే నిందితుడని ఒక అభిప్రాయానికి వచ్చారు. కానీ చివరికి ఈ కేసులో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. అవన్నీ కూడా పోలీసులకు దిమ్మతిరిగేలా చేశాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం మండలం అగ్రహారానికి చెందిన ఓ యువతి తన మేనమామ వివాహం చేసుకుంది. ఏడు సంవత్సరాల క్రితం వీరిద్దరికి వివాహం జరిగింది. ఆరు సంవత్సరాల క్రితం ఆ యువతికి ఒక బాబుకు జన్మనిచ్చింది. సరిగ్గా మూడు నెలల క్రితం అక్క బాబుకు అనారోగ్యం వాటిలింది. దీంతో అతని చికిత్స కోసం ఆ మహిళ భర్త అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో.. ఉపాధి కోసం మస్కట్ వెళ్లాడు.. అప్పటికే ఆ మహిళ ఐదు నెలల గర్భిణి. అయితే ఆ మహిళకు అదే గ్రామానికి చెందిన సత్య వేలు అనే వ్యక్తితో పరిచయం ఉంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేరే దేశంలో ఉండడంతో ఆ మహిళ ఇష్టానుసారమైపోయింది.
సత్య వేలుతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగేది. ఇదే క్రమంలో ఇటీవల సత్య వేలు తన భార్యకు ఆరోగ్యం బాగో లేకపోవడం తో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇదే సమయంలో ఆ వివాహిత అతనికి ఫోన్ చేసింది. తన వద్దకు రావాలని కోరింది. దీంతో అతడు నిరాకరించాడు. ఎప్పటికీ నీతోనే ఉండాలా అంటూ మండిపడ్డాడు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని.. ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చానని చెప్పాడు. ఆస్తమానం నీతో ఉండడం సాధ్యం కాదని పేర్కొన్నాడు.. దీంతో ఆ వివాహిత ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. నాకంటే నీకు నీ భార్య ముఖ్యం కాబట్టి.. ఆమెతో ఉండు.. నేను చనిపోతున్నా అంటూ సమాధానం ఇచ్చింది. ఇది సెల్ ఫోన్ లో రికార్డు అయింది. దీంతో ఆమె మృతికి సత్యవేలు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడి పై కేసు నమోదు చేశారు. విషయం ఆ వివాహిత కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సత్య వేలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
Also Read: ప్రియుడి మైకంలో.. సాంబార్ లో విషం పెట్టి భర్తను లేపేసింది..
స్థానికంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ప్రాణంగా చూసుకునే భర్త ఉన్నప్పటికీ.. ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నప్పటికీ ఆమె దారి తప్పింది. మరో వ్యక్తి పంచన చేరింది.. అతడికి సర్వస్వం సమర్పించింది. దీంతో అతడు దూరం పెట్టేసరికి తట్టుకోలేకపోయింది. చివరికి సమాజం దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకుంది. చనిపోయినప్పటికీ దారుణమైన పేరును మోసింది. అటు ఆరు సంవత్సరాల కుమారుడిని తల్లి లేని వాడిని చేసింది. అటు భార్య చనిపోవడం… ఇటు ఆరు సంవత్సరాల కుమారుడు తల్లి లేని వాడు కావడంతో.. ఆ తండ్రి గుండెలు పగిలే విధంగా రోదిస్తున్నాడు.