Srikakulam Crime News: అగ్నిసాక్షిగా.. వేదమంత్రాల సాక్షిగా.. బంధువుల సాక్షిగా వారిద్దరు ఒకటయ్యారు. మొదట్లో అన్యోన్యంగా తమ వైవాహిక బంధాన్ని కొనసాగించారు. కానీ ఇంతలోనే ఆ భార్య దారి తప్పింది. కట్టుకున్న వాడిని దూరం పెట్టడం మొదలు పెట్టింది. ఆ తర్వాత మరో వ్యక్తికి దగ్గర అయింది. మరో వ్యక్తి మోజులో పడి భర్తను దూరం పెట్టడం మొదలుపెట్టింది. అంతేకాదు ప్రియుడి మోజులో భర్తను అంతం చేసింది. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది..
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లోని మొండి గొల్ల వీధిలో 34 సంవత్సరాల నల్లి రాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడికి మౌనిక అనే భార్య ఉంది. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం నలిరాజు, మౌనికకు వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం.. మౌనికకు గుండు ఉదయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అటు ఉదయ్ కి కూడా వివాహం జరిగింది. ఈ వ్యవహారం నల్లి రాజుకు తెలిసింది. ఇది పద్ధతి కాదని.. వ్యవహారం మార్చుకోవాలని భార్యకు సూచించాడు. అయినప్పటికీ మౌనిక మారలేదు. అంతేకాదు ప్రియుడి సహకారంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక రూపొందించింది. ఇదే క్రమంలో ఉదయ్ కుమార్ తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయ్ కుమార్ ఆడవేషం ధరించాడు. నల్లి రాజును అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. దానికంటే ముందు నల్లి రాజుకు వాట్స్అప్లో మెసేజ్లు పెట్టాడు. దానికి రాజు తిరస్కరించాడు.
Also Read: ఆర్జీవీ వంటి చిన్న చేపల వేట ఎన్నాళ్లు.. ‘బిగ్ బాస్’ల విచారణ ఎప్పుడు?
రాజు తిరస్కరించిన నేపథ్యంలో అతడికి మద్యం తాగించి.. ఆ మత్తులోనే చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా మౌనిక నల్లి రాజుకు ఆహారంలో నిద్రమాత్రలు కల్పింది. ఈ విషయం తెలియని నల్లి రాజు ఆహారాన్ని తిన్నాడు. మత్తులో నిద్రపోయాడు. గాడమైన నిద్రలో ఉన్న నల్లి రాజును చూసిన మౌనిక.. ఉదయ్ కి ఫోన్ చేసింది. అతడు మల్లికార్జున్ అనే వ్యక్తి సహాయం తీసుకున్నాడు. వారిద్దరూ కలిసి నల్లి రాజు ఇంటికి వెళ్లారు. నిద్రలో ఉన్న రాజు కాళ్లను మౌనిక, మల్లికార్జున్ గట్టిగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఉదయం అతని ముఖం మీద దిండు పెట్టాడు. ఊపిరి ఆడకుండా చేశాడు. ఆ తర్వాత రాజు ద్విచక్ర వాహనాన్ని స్థానికంగా ఉన్న కాలనీలో పార్క్ చేశారు. అనంతరం ఉదయ్, మల్లికార్జున్ మరో ద్విచక్ర వాహనంపై రాజు మృతదేహాన్ని తీసుకొచ్చారు. రాజు బైక్ పార్క్ చేసిన ప్రాంతంలో అతడిని పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదని మౌనిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. తనదైన శైలిలో నటించింది. ఆగస్టు 7న రాజు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మౌనిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో మౌనిక పొంతనలేని సమాధానం చెప్పడంతో వారికి అనుమానం కలిగింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫలితంగా మౌనిక అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో మౌనికను, ఉదయ్, మల్లికార్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.