spot_img
Homeక్రైమ్‌Wedding Saree Theft: పెళ్లిళ్లలో చీరలు మాయం.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తెలిసింది ఇదీ..

Wedding Saree Theft: పెళ్లిళ్లలో చీరలు మాయం.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తెలిసింది ఇదీ..

Wedding Saree Theft:  ఒక్కో చీర ఖరీదు వేలల్లో ఉంటుంది. ఆ చీరలు మొత్తం పట్టువే. పైగా వేరే వేరే ప్రాంతాల నుంచి అత్యంత ప్రయాసపడి ఆ చీరలను ఆ మహిళలు కొనుగోలు చేశారు. బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో ఆ చీరలను కట్టుకుందామని పట్టుకొచ్చారు. కానీ వారి ఆనందం అనతి కాలంలోనే ఆవిరి అయిపోయింది. ఎంతో ముచ్చటపడి తెచ్చుకున్న పట్టుచీరలు కనిపించకుండా పోయాయి. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం గిర్నిబావి ప్రాంతంలో ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇటీవల ఏడు, 9 తేదీలలో ఈ ఫంక్షన్ హాల్ లో పెళ్లిళ్లు జరిగాయి. వాటికి హాజరుకావడానికి చాలామంది వచ్చారు. అందులో కొంతమంది మహిళలు ఇంటి దగ్గర నుంచి అత్యంత ఖరీదైన పట్టు చీరలు తీసుకొచ్చారు. ఫంక్షన్ హాల్ లో డ్రెస్సింగ్ రూమ్ లో మార్చుకుందామని అనుకున్నారు. ఈ క్రమం లోనే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన ఆడవాళ్లకు వింత అనుభవం ఎదురయింది. వారు తెచ్చుకున్న పట్టు చీరలు మాయం కావడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఈ విషయాన్ని తమ భర్తలకు చెప్పారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వారు చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఫంక్షన్ హాల్ మీద దృష్టి పెట్టారు. ఈనెల 12న ఒక వివాహ వేడుకకు కొంతమంది వచ్చారు. వారి ప్రవర్తన ఏమాత్రం బాగోలేదు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ మొదలుపెడితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. ఆ చీరలను మాయం చేసింది వీరేనట. పైగా వాటిని వేరే ప్రాంతాలలో విక్రయించేందుకు సిద్ధమయ్యారట. ఈలోగా పోలీసులు అకస్మాత్తుగా ఎంట్రీ ఇవ్వడంతో ఆ దొంగల ఆగడాలు చెల్లుబాటు కాలేదు. పోలీసులు ఆ దొంగల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. వారి వద్ద నుంచి కొన్ని రకాల చీరలు.. ఇంకా ఒక సంచిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తరహాలో చీరల దొంగతనం జరగడం ఇదే తొలిసారి అని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. మహిళలు చీరలను సెంటిమెంట్ గా భావిస్తారు. పైగా వాటికోసం భారీగా డబ్బు ఖర్చు పెడతారు. వివాహ వేడుకల సమయంలో ఖరీదైన చీరలు ధరించి ప్రత్యేకంగా కనిపించాలని ఆడవాళ్లు అనుకుంటారు. కానీ వారి ఆశల మీద ఈ దొంగలు నీళ్లు చల్లారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular