India Won: హోరాహోరిగా సాగుతుంది అనుకుంటే చప్పగా ముగిసింది. నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుందనుకుంటే.. ఏక పక్షంగా సాగింది. బలమైన బౌలింగ్ లేదు. ప్రతిఘటించే బ్యాటింగ్ లేదు. దుమ్ము రేపే ఫీల్డింగ్ అంతకన్నా లేదు. ఏదో ఆడాం అన్నట్టుగా ఆడారు. డ్రెస్సింగ్ రూమ్ లో అర్జెంటు పని ఉందన్నట్టుగా వెళ్లిపోయారు. భారత బౌలర్లు వికెట్లు తీస్తుంటే అలా చూస్తూ ఉండిపోయారు. పరుగులు సాధిస్తుంటే నిశ్శబ్దంగా ఉండిపోయారు వెస్టిండీస్ క్రికెటర్లు.
రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా వెస్టిండీస్ జట్టుపై బోణి కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ 146 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. రెండవ ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జట్టు 146 పరుగులకు కుప్ప కూలింది. భారత బౌలర్లు రవీంద్ర జడేజా, సిరాజ్, కులదీప్ అదరగొట్టారు. రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. సిరాజ్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. కులదీప్ రెండు వికెట్లతో అదరగొట్టాడు. దీంతో వెస్టిండీస్ జట్టు 146 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జట్టు 162 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత భారత జట్టు 448 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ సెంచరీలతో మోతెక్కించారు. దీంతో టీమిండియా ఏకంగా 448 పరుగులు చేసింది.
రెండవ ఇన్నింగ్స్ లో అదరగొట్టాల్సిన వెస్టిండీస్ జట్టు మరోసారి తేలిపోయింది. ఏ ఆటగాడు కూడా సత్తా చూపించలేకపోయాడు. మెజారిటీ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్ కు పరిమితమయ్యారు. టీమ్ ఇండియా బౌలర్లు పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. సిరాజ్ నిప్పులు చెరిగే విధంగా బంతులు వేయగా.. కులదీప్, రవీంద్ర జడేజా మ్యాజికల్ డెలివరీలు వేసి విండీస్ ప్లేయర్లకు చుక్కలు చూపించారు. దీంతో వెస్టిండీస్ జట్టు ఏమాత్రం కోలుకోలేకపోయింది. ఇన్నింగ్స్ తేడాతో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.
1ST Test. WICKET! 45.1: Jayden Seales 22(12) ct & b Kuldeep Yadav, West Indies 146 all out https://t.co/MNXdZcelkD #INDvWI #1stTEST #TeamIndia @IDFCfirstbank
— BCCI (@BCCI) October 4, 2025