Tragic Love Story: నేటి కాలంలో యువతీ యువకుల మధ్య ప్రేమ అనేది సర్వసాధారణమైపోయింది. సామాజిక మాధ్యమాలు యువతీ యువకుల మధ్య రాయబారం నడుపుతున్నాయి. అందువల్లే నేటి కాలం యువత ప్రేమను ఒక ఫ్యాషన్ గా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఊహలోకంలో వివరిస్తున్నారు. చదువులను పక్కనపెట్టి ప్రేమ మైఖంలో మునిగి తేలుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఏదైనా ప్రతిబంధకం ఎదురైతే తీవ్రమైన నిర్ణయం తీసుకుంటున్నారు. అలాంటిదే ఈ సంఘటన కూడా.
మంచిర్యాల జిల్లా పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన హిత వర్షిని అనే యువతి ఉంది.. ఈమె ఇటీవల సికింద్రాబాద్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమలో విఫలం కావడంతో ఆమె అంతటి నిర్ణయం తీసుకుంది. ఈమెను వినయ్ అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. ఆమె చనిపోయిన విషయం తెలుసుకున్న వినయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బావిలో దూకి బలవంతంగా తనువు చాలించాడు. దానికంటే ముందు ఒక లేఖ రాశాడు. అందులో తాను ఎదురుకుంటున్న బాధను వ్యక్తం చేశాడు. ఆమె లేని లోకంలో నేను ఉండలేనని.. వచ్చే జన్మలోనైనా ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఆ లేఖలో రాశాడు.
అతడు లేఖ రాసిన విధానం.. అందులో తన బాధను వ్యక్తం చేసిన విధానం అచ్చంగా మగధీర సినిమాను పోలి ఉంది. ఆ సినిమాలో కూడా కథానాయక నాయికలు ప్రేమ కోసం చనిపోతారు. అనేక జన్మల తర్వాత పుడతారు. చివరికి అనేక ఆటంకాలను ఎదుర్కొని తమ ప్రేమను గెలిపించుకుంటారు. వీరు కూడా తమ ప్రేమను గెలిపించుకోలేక బలవంతంగా తనవులు చాలించారు.. అయితే వారిద్దరూ అలా చనిపోడాన్ని స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.. పెద్దలు ఒప్పుకోకపోతే కనీసం వారిని ఒప్పించే విధంగా ఉంటే బాగుండేదని.. కానీ ఇలా బలవంతంగా తనవులు చాలించడం బాధాకరంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు..”వారిద్దరికీ ఎంతో భవిష్యత్తు ఉంది. పైగా ఈ కాలపు యువతీ యువకులు.. ఉన్నత చదువులు చదివారు. అలాంటప్పుడు జీవితంలో స్థిరపడి ప్రేమను గెలిపించుకుంటే బాగుండేది. అలా కాకుండా క్షణకాలం నిర్ణయాలు తీసుకొని ఇలా బలవంతంగా తనువులు చాలించడం బాధాకరంగా ఉందంటూ” గ్రామస్తులు వాపోతున్నారు.