Astrology Predictions September: గ్రహాలు కొన్ని రోజులపాటు ఒక రాశిలో ఉండి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. అలాగే ప్రతి నెల ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి మారుతూ ఉంటాయి. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు సెప్టెంబర్ 27 నుంచి కొత్త రాశిలోకి మారిపోతున్నాడు. ఈ రోజున ఉదయం 7 గంటలకు సూర్యుడు హస్త నక్షత్రంలోకి వెళ్తాడు. సూర్యుడు ఇలా నక్షత్రం మారడం వల్ల కొన్ని రకాల రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారిలో అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ పరిస్థితి అక్టోబర్ 10 వరకు ఉంటుంది. మరి అదృష్టం తెచ్చుకునే ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
సూర్యుడు మిగతా గ్రహాలకు అధిపతిగా ఉంటాడు. సూర్య గ్రహం అనుకూలంగా ఉంటే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అలాగే ఎన్నో రోజుల నుంచి అనుకునే కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. అందుకే సూర్య గ్రహం అనుగ్రహం వల్ల చాలామంది వెయిట్ చేస్తారు. సెప్టెంబర్ 27 నుంచి మూడు రాశుల వారికి సూర్యగ్రహం అనుకూలమైన వాతావరణం ఇవ్వనుంది. దీంతో వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది.
సూర్య గ్రహం అనుగ్రహం మేష రాశికి సెప్టెంబర్ 27 నుంచి కలగనుంది. అర్హులైన వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు గతంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను తొలగిస్తారు. గతంలో కంటే ఇప్పుడు వీరు సంతోషంగా ఉండగలుగుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇప్పుడే అనుకూలమైన సమయం. విహారయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు. అనుకోకుండా వ్యాపారులకు ధన లాభం ఉండే అవకాశం ఉంది. అతనపు ఆదాయం కోసం వేచి చూసే ఉద్యోగులు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది.
Also Read: ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్త..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులా రాశి వారికి ఈ నెల 27 నుంచి సానుకూల పరిస్థితులు ఉండనున్నాయి. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టు వస్తుంది. దీనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో మిగతా వారి కంటే నైపుణ్యం ప్రదర్శిస్తారు. అధికారుల మద్దతు కూడా ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థులు శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి ధన సహాయం అందుతుంది.
మీన రాశి వారికి ఈ నెల 27 నుంచి ఏ పని ప్రారంభించిన విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అనుకోకుండానే ధన లాభం వస్తుంది. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీంతో ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది.