Leader eye on friend wife: రామాయణంలో సీతాదేవి మీద రావణుడు మనసు పడతాడు. ఆమెను తన వశం చేసుకోవాలని భావిస్తుంటాడు. తనకు అనుకూలమైన సమయం రావడమే ఆలస్యం.. మాయలేడిగా రాముడిని పక్కదారి పట్టించి సీత దేవిని ఎత్తుకుపోతాడు. ఆ తర్వాత రాముడు ఆగ్రహానికి గురై కన్నుమూస్తాడు.
పరాయి వ్యక్తి భార్యపై వక్ర బుద్ధి ప్రదర్శిస్తే రావణుడి లాంటి వ్యక్తికే మరణశిక్ష తప్పలేదు. కానీ ఈ విషయాన్ని చాలామంది గుర్తించడం లేదు.. తాము మానవమాత్రులం.. భూమి మీద కొంతకాలం బతికి వెళ్లిపోయే వాళ్ళం. ఈ మాత్రం దానికి ఇటువంటి పనికిమాలిన వ్యవహారాలు ఎందుకు.. అనే ప్రశ్న వారిలో వ్యక్తం కావడం లేదు. కనీసం ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదు.. ఇటువంటి వక్రబుద్ధి వ్యవహారాలలో మనుషులకు తీవ్రమైన ప్రతిఘటనలు ఎదురవుతున్నప్పటికీ మారడం లేదు. పైగా మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు.
ఆ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. పైగా ఇటీవల ఓ పార్టీల సమూహం ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సహజంగానే ఆ ప్రాంతంలో ఓ పార్టీ నాయకుల హడావిడి పెరిగిపోయింది. అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఈ పరిణామంతో కాస్త నిశ్శబ్దంగా ఉండడం మొదలుపెట్టారు.. అయితే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఓ నాయకుడు ఆ ప్రాంతంలో హడావిడి చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు తన స్నేహితుడి భార్య మీద కన్ను వేశాడు. ఆమెను తన సొంతం చేసుకోవాలని భావించాడు. వాస్తవానికి అతని వయసు నాలుగు పదులు దాటిపోయినప్పటికీ.. ఇప్పటికీ అతడు పాతికేళ్ల కుర్రాడు అని అనుకుంటున్నాడు. పైగా తన స్నేహితుడి భార్యను చూసినప్పుడల్లా మరొక విధంగా ప్రవర్తించడం మొదలు పెడుతున్నాడు. ఈసారి ఏకంగా తన స్నేహితుడు లేనప్పుడు అతని ఇంటికి వెళ్ళాడు. అతని భార్యను ఇబ్బంది పెట్టాడు. తన కోరికలు తీర్చాలని.. తనకు పడక సుఖం అందించాలని.. తనతో మాత్రమే శారీరకంగా కలవాలని ఆమెను వేధించాడు.
ఈ వ్యవహారం మొత్తాన్ని ఇంటి పక్కన ఉన్న వ్యక్తి చూశాడు. చెప్పాల్సిన వాళ్లకు చెప్పాడు. దీంతో ఆ మహిళ భర్త నేరుగా రాజకీయ నాయకుడైన తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అతడిని చెంప దెబ్బ కొట్టాడు. ఇంకొకసారి తన ఇంటికి వస్తే బాగోదని నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. ఇది మనసులో పెట్టుకున్న ఆ రాజకీయ నాయకుడు.. తన స్నేహితుడు అని కూడా చూడకుండా అతనిని చంపేశాడు. కారుతో తొక్కించి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇది కాస్త రాజకీయరంగు పులుముకుంది. దీంతో రెండు వర్గాల మధ్య యుద్ధం మొదలైంది. ఏకంగా కొట్లాడుకునే స్థాయి దాకా వెళ్ళింది. ఆ రెండు వర్గాలు ఆ రాష్ట్రంలో బలమైన కులాలు కావడంతో పంచాయతీ ఏకంగా ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది.. ఇది పరిష్కారం అవుతుందా? ఇంకా ఎక్కడికి దారి తీస్తుంది? అనే ప్రశ్నలు పక్కన పెడితే ఓ మహిళ మీద వ్యామోహం.. అది కూడా స్నేహితుడి భార్య మీద పెంచుకున్న కామం.. ఓ రాజకీయ నాయకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఎంతో గొప్పగా బతకాల్సిన ఓ వ్యక్తి జీవితాన్ని మధ్యలోనే తుంచేసింది.. అందుకే అంటారు పరుల సొమ్ము పాము వంటిదని.. సొమ్ము మాత్రమే కాదు మిగతా వాటన్నింటికీ కూడా ఇదే వర్తిస్తుంది.