Upasana Second Baby: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan) మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈసారి కూడా వారసురాలు రాబోతోందా?, లేదా వారసుడు రాబోతున్నాడా అనేది తెలియదు కానీ, ఈ దీపావళి కి చిరంజీవి ఇంట్లో ఆమె సీమంతానికి సంబంధించిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా, సినీ ఇండస్ట్రీ నుండి అక్కినేని నాగార్జున దంపతులు, విక్టరీ వెంకటేష్ దంపతులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. దీనికి మెగా ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈసారి మాకు డబుల్ పండుగ అనే క్యాప్షన్ తో ఈ వీడియో ని విడుదల చేశారు. ఒక్క పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మినహా, కుటుంబ సభ్యులందరూ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. వరుణ్ తేజ్ కూడా తన బిడ్డతో రావడం ఈ వీడియో లో చూడొచ్చు.
పవన్ కళ్యాణ్ రాలేకపోయినప్పటికీ, ఆయన సతీమణి అన్నా లెజినోవా ఈ వేడుకలో పాల్గొనడం మనం ఈ వీడియో లో చూడొచ్చు. క్లిన్ కారా కూడా ఈ వీడియో లో ఉంది కానీ, ఆమె ముఖాన్ని కనపడనివ్వకుండా బ్లర్ లో పెట్టారు. కాస్త పైకి లేచి నడిచే వయస్సు వచ్చినప్పటికీ కూడా, క్లిన్ కారా ముఖాన్ని చూపించడానికి రామ్ చరణ్, ఉపాసన ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ కూతురు అంటే బయట ఆ పాపకు స్వేచ్ఛ అనేది ఉండదు. ఆ స్వేచ్ఛ కి ఎందుకు దూరం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతోనే సోషల్ మీడియా లో రివీల్ చేయలేదు అని రామ్ చరణ్ ‘అన్ స్టాపబుల్’ షో కి వచ్చినప్పుడు చెప్పుకొస్తాడు. ఇదంతా పక్కన పెడితే మెగా అభిమానులు ఈసారి రామ్ చరణ్ కి పుట్టబోయేది కొడుకు అయితే చాలా బాగుంటుందని ఆశిస్తున్నారు.
ఎందుకంటే చిరంజీవి కుటుంబం లో మొత్తం ఆడపిల్లలే ఉన్నారు. ఒక్క అబ్బాయి కూడా జన్మించలేదు. నాగబాబు కుటుంబం లో కూడా రీసెంట్ గానే వారసుడు జన్మించాడు. మా చిరంజీవి కుటుంబం లో కూడా వారసుడు జన్మిస్తే బాగుండును అని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ దేవుడు ఎలా తల రాత రాసి పెట్టి ఉన్నాడో చూడాలి. మెగా అభిమానులకు కనుల పండుగ లాంటి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మీరు కూడా ఆ వీడియో ని చూసి ఆనందించండి.