Crime news : కదులుతున్న బస్సులో అఘాయిత్యం.. తోటి ప్రయాణికులు, కుమార్తె ఉండగానే దారుణం!

మనిషి మాయమవుతున్నాడు. మృగంగా మారుతున్నాడు. అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నాడు. అటువంటి దారుణ ఘటన ఒకటి హైదరాబాదులో తాజాగా వెలుగులోకి వచ్చింది.

Written By: Dharma, Updated On : July 31, 2024 3:40 pm
Follow us on

Crime news : బస్సులో ఓ చిన్నారితో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్ కన్నేశాడు. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులో నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు మరో డ్రైవర్ సహకరించాడు. చివరకు బాధితురాలు 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్సును అడ్డుకొని డ్రైవర్ ను అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన హైదరాబాదులో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హరికృష్ణ ట్రావెల్స్ కి చెందిన బస్సు సోమవారం సాయంత్రం నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా కు బయలుదేరింది. ఆ బస్సులో డ్రైవర్లు సిద్దయ్యతో పాటు కృష్ణ ఉన్నారు. 36 మంది ప్రయాణికులతో బస్సు నిర్మల్ నుంచి బయలుదేరింది. బస్సు స్లీపర్ కోచ్ కావడంతో ప్యాసింజర్ నిద్రించేందుకు ప్రత్యేక సీట్లు ఉన్నాయి. అదే బస్సులో ఓ వివాహిత తన కూతురితో కలిసి ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తోంది. ఒకటవ నంబర్ బెర్త్ బుక్ చేసుకొని నిర్మల్ లో బస్సు ఎక్కింది. మెదక్ జిల్లా చేగుంటకు బస్సు వచ్చేసరికి రాత్రి 10:30 గంటల సమయం పట్టింది. అక్కడే భోజనం కోసం బస్సును ఆపారు. అందరూ హోటల్లో భోజనాలు చేశాక తిరిగి బస్సు ఎక్కారు. ఒకే సీటులో నిద్రించేందుకు ఇబ్బందిగా ఉందని బాధిత మహిళ రెండో డ్రైవర్ కృష్ణకు తెలిపింది. ఏదైనా బెర్త్ ఖాళీగా ఉంటే కేటాయించాలని కోరింది. దీంతో వారికి 5, 6 బెర్త్ లు కేటాయించడంతో వారు పడుకున్నారు. ఇద్దరూ నిద్రపోయాక రెండో డ్రైవర్ కృష్ణ ఆమె వద్దకు వెళ్లాడు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. దీంతో బస్సు ఆపాలంటూ బాధితురాలు కేకలు వేసింది. అయినా డ్రైవర్ సిద్దయ్య బస్సు ఆపలేదు. ఆమె కేకలను విన్న తోటి ప్రయాణికులు మేల్కొన్నారు. బస్సును ఆటో ప్రయత్నం చేసిన డ్రైవర్ సిద్దయ్య వినలేదు. అతివేగంగా పోనిచ్చాడు.

* బాధితురాలి ధైర్యం
అయితే బాధిత మహిళ ధైర్యం పోగుచేసుకుంది. రాత్రి 12 గంటల సమయంలో 100 కు కాల్ చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్సు లొకేషన్ ఆధారంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాటి ఉప్పల్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో దగ్గరలోని ఓయూ పోలీసులు అప్రమత్తమయ్యారు. తార్నాక మెట్రో పిల్లర్ 1010 వద్ద బస్సును అడ్డుకున్నారు. ఇది గమనించిన రెండో డ్రైవర్ కృష్ణ బస్సు దిగి పారిపోయాడు. పోలీసులు బస్సుడ్రైవర్ సిద్ధయ్యను అరెస్టు చేశారు. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. పారిపోయిన కృష్ణ కోసం గాలించి అతడిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

* ఏడేళ్ల కిందట భర్త మరణం
బాధితురాలి భర్త ఏడు సంవత్సరాల క్రితం మరణించాడు. అప్పటినుంచి కుమార్తె తో నివాసం ఉంటోంది. ప్రకాశం జిల్లాలో బంధువుల ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించి వీరిద్దరూ డ్రైవర్లు పనిచేస్తున్నారు. ప్రధాన నిందితుడు కృష్ణది నెల్లూరు. గత కొద్దిరోజులుగా ఆ ట్రావెల్స్ లో పనిచేస్తున్నారు. వారి వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరగగా.. బుధవారం వెలుగులోకి రావడం విశేషం.

* బస్సుల్లో భద్రతపై ఆందోళన
హైదరాబాదు నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు,చెన్నై, ముంబాయికి 5000 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే బస్సుల్లో ఇటీవల అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ పై పోలీసు నిఘా పెట్టాలని కోరుతున్నారు.