Surrogate Mother: ఆర్థిక సమస్యలు అంతకంతకు పెరుగుతుండడంతో.. ఓ వ్యక్తి ఆమెకు తారసపడ్డాడు. అద్దెకు గర్భం ఇస్తే సమస్యలు మొత్తం తొలగిపోతాయని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె కూడా తన భర్తను ఒప్పించింది. కానీ సరోగసికి ఒప్పుకోవడం ఆమె ప్రాణాలను తీసింది. హైదరాబాద్ రాయదుర్గంలో జరిగిన ఈ దారుణం తెలంగాణలో సంచలనం కలిగించింది. రాయదుర్గం ప్రాంతంలోని మై హోమ్ భుజ ప్రాంతంలో రాజేష్ బాబు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాస ఉంటున్నాడు. రాజేష్ బాబు దంపతులకు ఇప్పటివరకు సంతానం లేకపోవడంతో సందీప్ అనే మధ్యవర్తిని సంప్రదించారు. ఆ సందీప్ ఒడిశా రాష్ట్రానికి చెందిన సంజయ్ సింగ్, అశ్విత (25) అనే దంపతులను ఆశ్రయించాడు. వారితో పది లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. వారు తమ నాలుగు సంవత్సరాల కుమారుడితో కలిసి అక్టోబర్ 24న హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఇక అప్పటి నుంచి అశ్వితను రాజేష్ బాబు తన అపార్ట్మెంట్లోని తొమ్మిదవ అంతస్తులో నిర్బంధించాడు. ఆమె భర్త సంజయ్ సింగ్ ను అదే అపార్ట్మెంట్లో ఏడవ అంతస్తులో నివాసం ఉండేలా ఏర్పాటు చేశాడు. అశ్విత సరోగసి ద్వారా బిడ్డకు జన్మ ఇవ్వడానికి అనుమతుల ప్రక్రియ జరుగుతుండగానే.. కొద్దిరోజులుగా రాజేష్ అశ్వితను లైంగికంగా వేడి చేయడం మొదలుపెట్టాడు. ” సరోగసి ద్వారా మాత్రమే బిడ్డను కనడానికి ఒప్పుకుంటాను. లైంగికంగా కలిసి ఎందుకు ఒప్పుకునేది లేదని” అశ్విత పలుమార్లు రాజేష్ బాబుకు చెప్పింది.. మరోవైపు రాజేష్ బాబు తనని పెడుతున్న ఇబ్బందులను తన భర్తతో అశ్విత పలుమార్లు చెప్పింది. “ఎలాగోలా బతుకుదాం. తిరిగి మన రాష్ట్రానికి వెళ్లిపోదాం” అని చెప్పింది. అయితే ” కుదుర్చుకున్న డీల్ ప్రకారం బిడ్డను కనిస్తే మన కష్టాలు తొలగిపోతాయని” సంజయ్ తన భార్యకు నచ్చ చెప్పాడు. అయితే రాజేష్ బాబు అశ్విత పై లైంగిక వేధింపులను మరింత తీవ్రతరం చేశాడు. అతడి నుంచి తప్పించుకొని ఎలాగైనా సరే స్వగ్రామం వెళ్లిపోవాలని అశ్విత నిర్ణయించుకుంది.
అదే ఆమె ప్రాణం తీసింది
రాజేష్ బాబు ఉండే ప్లాట్ బాల్కనీ నుంచి తాను ధరించే చీరను కట్టింది. దానిద్వారా రెండు అంతస్తుల మేర కిందికి జారిపోవాలని నిర్ణయించుకుంది. అలా జారిన తర్వాత అక్కడ ఉండే ర్యాంప్ నుంచి భర్త ఉండే ప్లాట్ లోకి వెళ్లిపోవాలని భావించింది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో తాను ధరించే చీరలను ఒకదానికి ఒకటి కట్టింది. తొమ్మిదవ అంతస్తు బాల్కనీ నుంచి వాటిని వేలాడదీసింది. అక్కడి నుంచి కిందకు వచ్చేందుకు ప్రయత్నించింది. అయితే పట్టు కోల్పోవడంతో కిందపడి తీవ్రంగా గాయపడింది.. అక్కడికక్కడే దుర్మరణం పాలయింది. రాయదుర్గం పోలీసులు అశ్విత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజేష్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Surrogate mother suspicious death of a woman brought for surrogacy in hyderabad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com