Mary solves six year old child case: ఇది సభ్య సమాజం తలదించుకునే సంఘటన. మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరు బాధపడే ఘటన. ఆరు సంవత్సరాల బాలికపై ఓ దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆ ఘోరం మామూలుది కాదు. మాటలకందనిది. అంతటి క్రూరమైన ఘటనకు పాల్పడిన అతడు.. దర్జాగా తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు ఫిర్యాదు అందినప్పటికీ ఆధారం లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులకు తట్టిన ఒక ఆలోచన కేసు స్వరూపాన్ని మొత్తం మార్చేసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంబాల్ జిల్లా బాబ్రా ప్రాంతంలో ఓ ఆరు సంవత్సరాల బాలికపై ఓ దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు. వాడి పేరు సందీప్. ఆ ఘోరానికి పాల్పడిన తర్వాత వాడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు రంగంలోకి దిగారు. అత్యంత వేగవంతంగా విచారణ చేపట్టారు. అక్కడ ఒక స్కార్ఫ్ మినహా పెద్దగా ఆధారాలు లేవు. సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో ఈ కేసు అత్యంత సవాల్ గా మారింది. ఆధారాలు దొరకపోవడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు.
కేసు ను త్వరగా పరిష్కరించాలని పోలీసులు వెంటనే.. ఒక అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మేరీ అనే జాగిలాన్ని రంగంలోకి దింపారు. అది అద్భుతమైన జాగిలం. ఏదైనా వెంటనే పసిగడుతుంది. అంతేకాదు క్షణాల్లోనే దాని చాకచక్యంతో పోలీసులకు ఆధారాలను అందిస్తుంది. ఈ కేసులో కూడా అలానే వ్యవహరించింది. మేరీని రంగంలోకి దింపడమే ఆలస్యం.. అది సంఘటన స్థలం వద్ద లభించిన స్కార్ఫ్ వాసన చూసి వెంటనే పరుగులు పెట్టింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆ దుర్మార్గుడిని పట్టించింది.
స్కార్పు వాసన చూసిన మేరీ సందీప్ ఇంటి వైపు పరుగులు పెట్టింది. పోలీసులు దానిని అనుసరించారు. ఇదే క్రమంలో సందీప్ పోలీసులను చూసి పారిపోవడం మొదలు పెట్టాడు. దీంతో వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ సందీప్ కాలు నుంచి దూసుకుపోయింది. సందీప్ ను పట్టించిన మేరీకి పోలీసులు పదివేల రూపాయల చెక్ అందించారు.. సీసీ కెమెరాలు లేవు. ఎటువంటి ఆధారం లేదు. ఒక స్కార్ఫ్ మాత్రమే అక్కడ ఉంది. అయినప్పటికీ పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టారు. త్వరగా ఆ దుర్మార్గుడిని పట్టుకున్నారు.
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. రేపిస్ట్ని పట్టించిన శునకం
ఉత్తరప్రదేశ్ సంభల్ జిల్లాలోని బాబ్రాలలో వెలుగు చూసిన ఘటన
సందీప్ అనే రాక్షసుడు ఆరేళ్ల చిన్నారిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి పరార్
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగి.. విచారణ చేపట్టిన పోలీసులు
స్కార్ఫ్… pic.twitter.com/DRtabqHE0j
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 23, 2026
