Meerpet Incident: ఇటీవల రాంగోపాల్ వర్మ సిండికేట్(Syndicate movie) అనే పేరుతో ఓ సినిమాను మొదలు పెట్టాడు. రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) అంటేనే హింస, రక్తపాతం, అశ్లీలత అధికంగా ఉంటాయి. శివ(Shiva), రంగీలా(Rangeela), కంపెనీ(company) వంటి చిత్రాలు తీసిన రాంగోపాల్ వర్మ.. ఏకంగా బూతు స్థాయికి దిగజారి పోయాడు.. అనేక పాపాలు చేశాడేమో.. అనేక దుర్మార్గాలు చేశాడేమో.. వాటన్నింటినీ కడుక్కోవడానికి ఇప్పుడు సిండికేట్ అనే సినిమా తీస్తున్నాడు.. పైగా దానికి ” ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు అవుతాడు” అని ట్యాగ్ లైన్ కూడా పెట్టేసుకున్నాడు.. ఇప్పుడే సడన్ గా ఆ వాక్యం ఎందుకు గుర్తొచ్చిందంటే.. హైదరాబాదులోని మీర్ పేట్(meerpet) ప్రాంతంలో జరిగిన ఓ దారుణం పొద్దున వార్తా పత్రికలు(newspapers) చదువుతుంటే కళ్ళ ముందు కదలాడింది..
ఆ వార్త చదువుతుంటే రాంగోపాల్ వర్మ రాసిన ట్యాగ్ లైన్ అచ్చంగా గుర్తుకు వచ్చింది. సమాజంలో నేరాలు జరుగుతున్న తీరు.. వాటిని ప్రేరేపిస్తున్న సంఘటనలు.. చివరికి రాంగ్ టర్న్ సినిమాలోని విలన్లు కూడా వణికి పోతారేమో.. మనిషి క్రూరత్వం ముందు.. అలాంటి వారు మాత్రం ఏం నిలబడగలరు.. ఆ కేసు చూస్తుంటే.. ఆ వివరాలు చదువుతుంటే నిజంగానే ఒళ్ళు గజగజ వణికిపోయింది.. అతని పేరు గురుమూర్తి.. ఆర్మీలో రిటైర్డ్ జవాన్. ఆంధ్రప్రదేశ్లో అని ప్రకాశం జిల్లా జేపీ చెరువు గ్రామం.. 13 సంవత్సరాల క్రితం వెంకట మాధవి అనే మహిళతో అతడికి పెళ్లయింది. ఇద్దరు కుమార్తెలు సంతానం. ఆర్మీ నుంచి రిటర్మెంట్ అయిన తర్వాత హైదరాబాద్ లోని జిల్లెలగూడ ప్రాంతంలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం కంచన్ బాగ్ DRDO లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు.. ఆయనకు భార్య మీద అనుమానం ఉంది. చాలా కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. భార్య మీద కోపం అంతకంతకు పెరుగుతోంది. అందుకే ఈసారి ఆమెను ఏకంగా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఏమాత్రం ఆధారాలు లభించకుండా ఎలా చంపాలో యూట్యూబ్ ఛానల్స్ లో చూశాడు.. వెబ్సైట్లో వార్తలు చదివాడు..
కొన్ని నేరపూరిత చిత్రాలు, హింసాత్మకమైన వెబ్ సిరీస్ లు చూశాడు. ఇటీవల కాలంలో చాలామంది నేరస్తులు యూట్యూబ్ ను ఆశ్రయించే కదా ఘోరాలు చేసేది.. భార్యను చంపడానికి ముందు కుక్కను హతమార్చాడు. దాని శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి.. ఉడికించి.. ఆ తర్వాత పొడిగా మార్చాడు. గురుమూర్తికి ధైర్యం వచ్చింది.. ఇంకేముంది ఈనెల 16న మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈసారి గురుమూర్తి లో కోపం తారాస్థాయికి చేరింది. పట్టరాని కోపంతో భార్యను చంపేశాడు. ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ తర్వాత ఆ భాగాలను కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టాడు. కాల్చి పొడి చేశాడు. చివరికి మరుగునీటి కాలువలో ఆ పొడిని పారబోశాడు.
క్రూరమైన ధోరణి
నిజంగా గురుమూర్తి ప్రదర్శించిన ధోరణి క్రూరత్వం అనే పదానికి మించి ఉంది.. ఇంత దారుణానికి పాల్పడిన తర్వాత భార్య కనిపించడం లేదని.. తనకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని.. ఇంకో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని ప్రచారం చేశాడు.. అయితే గురుమూర్తి వ్యవహార శైలి గురించి అతడి అత్త ఉప్పాల సుబ్బమ్మకు అనుమానం.. ఆమె ఉప్పల్లోనే ఉంటుంది. మాధవి కనిపించకపోవడంతో.. ఆమెలో అనుమాన పెరిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు కాస్త లోతైన విషయాలు చెప్పింది. దీంతో వారు రంగంలోకి దిగారు. గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిదైన శైలిలో విచారించారు. అప్పుడు అన్ని నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గురుమూర్తి చెబుతున్న విషయాలు విన్న పోలీసులకు చెమటలు పట్టాయి. విచారించిన కొంతమంది పోలీసులు షాక్ కు గురయ్యారు.. అంతే కదా.. పులులు, సింహాలు, చిరుతలు, తోడేళ్లు, హైనాలు, మొసళ్ళు.. మనిషితో పోల్చితే..ఇవేమన్నా క్రూర జంతువులా..