Dil Raju : ఇప్పటివరకు తెలుగులో చాలామంది ప్రొడ్యూసర్స్ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. అందులో డా..డి రామానాయుడు (Ramanaidu) ఒకరు. ఆయన చేసిన సినిమాలే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా చాలా గొప్ప ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ సైతం సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. నిజానికి ఒక సినిమా స్టార్ట్ అవ్వాలి అంటే దానికి ప్రొడ్యూసర్ అనేవాడు చాలా కీలకం. అతను డబ్బులు పెడితేనే సినిమా ముందుకు వెళ్తుంది. లేకపోతే మాత్రం సినిమా మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు(Dil Raju) లాంటి ప్రొడ్యూసర్ 50 సినిమాలకు పైన ప్రొడ్యూస్ చేసి తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి ఆ సినిమా చూడొచ్చు అనే అంత ధైర్యాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ గా కూడా ఆయన చాలా సంవత్సరాల నుంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం…ఇక దిల్ రాజు కెరియర్ లోనే ఇప్పటివరకు చాలా సినిమాలు తీసిన కూడా ఆయనకి భారీగా డిజాస్టర్ బాట పట్టి భారీ నష్టాన్ని మిగిల్చిన మాత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమా అనే చెప్పాలి. ఇక రిలీజ్ కి ముందు ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉండేవి.
కానీ ఈ సినిమా మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది… తద్వారా ఈ సినిమా మీద భారీ కలెక్షన్స్ అయితే రాలేకపోయాయి. దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించిన ఈ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చిందనే చెప్పాలి.
ఇక ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమాతో దిల్ రాజు సక్సెస్ బాట పట్టి కొంతవరకు రికవరీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆ నష్టం రికవరీ అవుతుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ను నమ్మి దిల్ రాజు ఈ సినిమా మీద 500 కోట్ల బడ్జెట్ ని కేటాయించినప్పటికి అది భారీ డిజాస్టర్ గా మిగలడం అనేది ఆయన కెరియర్ లోని మరుపురాని ఒక బ్యాడ్ అనుభూతిగా మిగలవచ్చు…
ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని సాధించి ఇప్పుడు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. కానీ గేమ్ చేంజర్ విషయంలో మాత్రం అలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయాడని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…