Ind Vs Eng T20: శుభమాని కోల్ కతా ఈడెన్ గార్డెన్స్(Kolkata Eden gardens) టీమిండియా (team India) ఇంగ్లాండ్ జట్టుపై (England team) ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 5 t20 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ముందడుగు వేసింది. ఇంతటి విజయాన్ని గొప్పగా చెప్పకుండా ఇలా శీర్షిక పెట్టారేంటి అని మా మీద మీకు కోపం రావచ్చు.. కానీ ఈ కథనం చదవండి అసలు విషయం మీకే అర్థమవుతుంది..
కోల్ కతా లో జరిగిన తొలి t20 మ్యాచ్లో టీమిండియా అని రంగాలలో ఇంగ్లాండ్ జట్టుపై అధిపత్యాన్ని ప్రదర్శించింది. పూర్తి యువ జట్టుతో నిండిన ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది. ముందుగా బౌలింగ్ ఎంచుకొని.. మైదానంపై ఉన్న తేమను అనుకూలంగా మార్చుకొని.. ఇంగ్లాండ్ బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. బట్లర్ మినహా మిగతా వారంతా టీమిండియా బౌలర్ల ముందు సాగిలపడ్డారు. దూసుకు వస్తున్న బంతులను ఎదుర్కోలేక.. చేతులెత్తేశారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ భారీ స్కోరు చేసేలాగా కనిపించలేదు. పైగా బంతులను ఎదుర్కోలేక ఇంగ్లాండ్ బ్యాటర్లు క్యాచ్ అవుట్ లు అయ్యారు. ఇక వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అయితే ఆడ లేక బ్యాట్ లెత్తేశారు. అతడు సంధించిన పంతులు ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాయి. కనీసం సింగిల్స్ తీసుకునే అవకాశం కూడా అతడు ఇవ్వలేదంటే బౌలింగ్ ఏ స్థాయిలో వేశాడో అర్థం చేసుకోవచ్చు. అయితే 7 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ భారత్ ఆ విషయంలో ఇంగ్లాండ్ జట్టు కంటే వెనుకబడి ఉంది.
పాకిస్తాన్ సరసన..
కోల్ కతా వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ.. ఇంగ్లాండ్ కంటే వెనుకబడి ఉంది. ఇంగ్లాండ్ జట్టు 2010 నుంచి 2021 వరకు కార్డీప్ వేదికగా జరిగిన మ్యాచ్లలో ఏకపక్ష విజయాలు సాధించింది. ఈ వేదికపై ఇంగ్లాండ్ జట్టు ఏకంగా ఎనిమిది వరుస విజయాలు సాధించింది. టి20 ఫార్మేట్ లో ఒక జట్టు ఈ స్థాయిలో విజయాలు సాధించడం ఇదే ప్రథమం. అందువల్లే ఈ జాబితాలో ఇంగ్లాండ్ జట్టు మొదటి స్థానంలో ఉంది. ఇక 2008 నుంచి 2021 వరకు కరాచీ వేదికగా జరిగిన టి20 మ్యాచ్ లలో పాకిస్తాన్ గెలిచింది. ఈ వేదికపై ఏడు మ్యాచ్లు జరగగా.. ఏడు మ్యాచ్లలోనూ పాకిస్తాన్ విజయ దుందుభి మోగించింది. ఇక 2016 నుంచి 2025 సీజన్ వరకు కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లలో భారత్ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. ఈ వేదికపై ఇప్పటివరకు జరిగిన 7 t20 మ్యాచ్లలో భారత్ విజయం సాధించింది.. ప్రస్తుతం ICC t20 ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇటీవల కాలంలో వరుస సిరీస్ విజయాలు సాధిస్తూ ప్రత్యర్థి జట్లకు అందనంత ఎత్తులో ఉంది భారత్. అటాకింగ్ ఫీల్డింగ్.. మెస్మరైజింగ్ బ్యాటింగ్.. సూపర్ బౌలింగ్ తో భారత జట్టు టి20లలో సిసలైన శక్తిగా ఆవిర్భవించింది. అందువల్లే వరుస విజయాలతో దూసుకుపోతోంది.