Tejeshwar Case: మరో మేఘాలయ హనీమూన్ గా భావిస్తున్న గద్వాల ఘటనలో అడుగడుగునా సంచలన నిజాలు తెలుస్తున్నాయి.. మృతుడు తేజేశ్వర్ తరపు బంధువులు చెబుతున్న నిజాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత పాల్పడిన దారుణాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.
సుజాత ఒక బ్యాంకులో స్వీపర్ గా పనిచేసేది. ఆ బ్యాంకులో పనిచేసే ఉన్నతోద్యోగితో ఆమెకు సంబంధం ఏర్పడింది. ఆ ఉన్నతోద్యోగి సుజాత ఇంటికి తరచూ వెళ్లేవాడు. విక్రమములోనే సుజాత కూతురు ఐశ్వర్యతో అతడు చనువు పెంచుకున్నాడు. అదికూడా శారీరక సంబంధానికి దారి తీసింది. అటు తల్లి ఇటు కూతురుతో అతడు ఏకకాలంలో వ్యవహారం సాగించడం మొదలుపెట్టాడు. ఇది ఇలా సాగుతుండగానే ఐశ్వర్య కు పెళ్లి చేయాలని సుజాత భావించింది. బ్యాంకు ఉద్యోగి తెలియకుండానే ఈ పని చేసింది. మధ్యవర్తుల ద్వారా తేజేశ్వర్ ను కలిసింది. అతడు కాస్త అమాయకంగా ఉండడంతో తన ప్రణాళిక మొదలుపెట్టింది. సుజాత పన్నాగం తెలియని తేజేశ్వర్ ఐశ్వర్యతో వివాహానికి ఒప్పుకున్నాడు. ఇంతవరకు కథ బాగానే నడిచింది.. అయితే ఈ వ్యవహారం బ్యాంకు ఉద్యోగి తెలియడంతో సుజాతను నిలదీశాడు. అంతేకాదు ఐశ్వర్యను కూడా బెదిరించాడు. దీంతో ఐశ్వర్య వివాహం నిశ్చయమైనప్పటికీ బ్యాంకు ఉద్యోగితో లేచిపోయింది. ఐదు రోజులపాటు అతనితో గడిపింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ.. మళ్లీ ఆమె ఇంటికి వచ్చింది.
Also Read: ‘సితారే జమీన్ పర్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..అమీర్ ఖాన్ బ్రాండ్ పవర్ చెక్కు చెదరలేదుగా!
నాలుక మడత పెట్టారు
బ్యాంకు మేనేజర్ పారిపోయిన తర్వాత.. ఐదు రోజుల అనంతరం ఐశ్వర్య వచ్చింది. ఈ విషయం తేజేశ్వర్ కు తెలిసింది. దీనిపై అతడు నిలదీయగా.. పెళ్లికి కావలసిన కట్నం తన తల్లి ఇవ్వలేదని.. అందువల్లే నా స్నేహితురాలి దగ్గరికి వెళ్లి వచ్చానని ఐశ్వర్య తేజేశ్వర్ తో చెప్పింది. పైగా అతడి మీద పడి ఏడ్చింది. నన్ను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది. ఐశ్వర్య చెప్పిన మాటలు విన్న తేజేశ్వర్ అవన్నీ నిజమని అన్నాడు. ఆ తర్వాత నెల క్రితం పెళ్లయింది. ఐశ్వర్య కు వివాహం జరిగిన విషయం తెలుసుకున్న బ్యాంకు ఉద్యోగి మరింత రెచ్చిపోయాడు. ఐశ్వర్య ను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె అతడికి సరెండర్ అయిపోయింది. అంతే కాదు బ్యాంకు మేనేజర్ తో నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. చివరికి మన అనుబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ ను తొలగించుకోవాలని.. ఐశ్వర్య, బ్యాంకు ఉద్యోగి నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సుజాతకు చెబితే ఆమె కూడా ఓకే చెప్పింది.. మొత్తంగా ముగ్గురు కలిసి అతడిని అంతం చేయడానికి ప్లాన్ రూపొందించి.. దానిని ఆచరణలో పెట్టారు. అయితే తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్య, సుజాత మీద అనుమానాలు వ్యక్తం చేయడం.. పోలీసులు ఐశ్వర్య కాల్ డేటా పరిశీలించడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల మేఘాలయాలో చోటు చేసుకున్న హనీమూన్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు దానిని మరిచే విధంగా గద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇంకా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read: వెంకటేష్ ‘దృశ్యం 3’ వచ్చేస్తుంది..ఈసారి డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!