Kismatpur woman case: ఆమె వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఆమెకు కల్లు తాగడం అలవాటు. హైదరాబాదులో దొరికేది మత్తు కల్లు కాబట్టి… ఆమె దానికి బానిస అయింది.. గత ఆదివారం ఫుల్లుగా కల్లు తాగింది.. ఆ మత్తులో రోడ్డుమీదనే పడిపోయింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే కిస్మత్ పుర వంతెన కింద చనిపోయి కనిపించింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. వారు రంగంలోకి దిగారు.. ఆ తర్వాత సింగం స్టైల్లో విచారణ సాగించారు.
కల్లు మత్తులో రోడ్డుమీద పడిపోయిన ఆ మహిళను కొందరు ఆటో డ్రైవర్లు గుర్తించారు. ఆమెపై కన్నేసి తమ వెంట తీసుకెళ్లారు. వాస్తవంగా ఆ మహిళది యాకుత్ పూర. ఆమె కల్లు తాగడానికి హైదర్ గూడ వచ్చింది. అక్కడ ఆమెను గుర్తించిన ఆటో డ్రైవర్లు తమ వెంట తీసుకువెళ్లారు. అప్పటికే రాత్రి అయింది. కిస్మత్ పుర ప్రాంతంలోకి వెళ్లి.. అక్కడ వంతెన కింద ఎవరూ లేకపోవడంతో ఆ మహిళను ఆటో లో నుంచి కిందికి దించారు. ఆమెకు మాయ మాటలు చెప్పారు. వంతెన కిందకు తీసుకెళ్లారు.. ఆమెపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించారు. దానికి ఆమె ఒప్పుకోలేదు. ముందుగా బెదిరించారు. ఆ తర్వాత తీవ్రంగా కొట్టారు. ఒంటి మీద ఉన్న వస్త్రాలను తొలగించారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి అంతం చేశారు. మృతదేహాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయారు.
ఘటన జరిగిన ప్రాంతం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు రంగ ప్రవేశం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. కొన్ని ప్రాంతాలలో సిసి ఫుటేజ్ లభ్యం కాగా.. మరికొన్ని ప్రాంతాలలో లభ్యం కాలేదు. అయితే హైదర్ గూడ కల్లు కాంపౌండ్ లో ఆమె తాగిన దృశ్యాల ఆధారంగా పోలీసులు సిసి ఫుటేజ్ పరిశీలించారు. దాదాపు ఐదు రోజులపాటు సిసి ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. ఆ తర్వాత నిందితులను కనుగొన్నారు. వారి కదలికలను పసిగట్టి.. గుర్తించారు. ఆటో నెంబర్ పరిశీలించిన పోలీసులు.. ఆ నెంబర్ల మీద నమోదైన ఫోన్ నెంబర్లను ట్రేస్ చేశారు. అనంతరం నిందితులను పట్టుకున్నారు. మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. కీలక ఆధారాలను పోలీసులు సేకరించి.. కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు.