Rajasthan Girl Incident: రాక్షసుడు సినిమా చూశారా.. అందులో ఓ స్కూల్లో ఓ అబ్బాయి చదువుతుంటాడు. అతడు అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అదే విషయాన్ని ఆమెకు చెబుతాడు. ఆ అబ్బాయి చూసేందుకు విచిత్రంగా కనిపిస్తాడు. దీంతో వారంతా ఆ బాలుడిని హేళన చేస్తుంటారు. దీంతో అతని తట్టుకోలేక ఒక రకమైన ప్రవర్తనతో అందరికీ నరకం చూపిస్తుంటాడు.. అయితే అందరూ ఇలా ఉండరు. కొంతమంది ఎగతాళిని తట్టుకోలేక కఠిన నిర్ణయం తీసుకుంటారు.. మానసిక వైద్యుల అధ్యయనం ప్రకారం.. ఒక మనిషిని మిగతావారు ఎగతాళి చేస్తే తట్టుకోలేడు.. అది అతడిలో ఆత్మ న్యూనతా భావానికి దారితీస్తుంది. ఆ సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకునేలాగా ఉసిగొల్పుతుంది.
రాజస్థాన్ రాష్ట్రంలో ఇటీవల తొమ్మిది సంవత్సరాల బాలిక బిల్డింగ్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.. అయితే ఆ బాలిక ఇలా చేయడానికి కారణమేమిటో మొదట్లో అర్థం కాలేదు.. ఆ బాలిక అలా చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. దానికి వారి దగ్గర నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు.. యాజమాన్య వైఖరి వల్లే ఆ బాలిక అలా పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు.. అయితే ఈ వ్యవహారంలో వారు దర్యాప్తు చేస్తుండగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.. అవి పోలీసులనే కాదు సభ్య సమాజాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
ఆ బాలిక రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్రాంతంలో ఓ ప్రవేట్ పాఠశాలలో చదువుతోంది. ఇటీవల ఆ బాలిక తన తరగతి విద్యార్థికి హాయ్ చెప్పింది. దీంతో అతడికి నువ్వు లవ్ ప్రపోజ్ చేశావని మిగతా విద్యార్థినులు ఆమెను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు.. రకరకాలుగా కామెంట్స్ చేశారు. ఆమె లేదు అని చెబుతున్నప్పటికీ కూడా వినిపించుకోలేదు. పదేపదే ఆమెను అదేవిధంగా అనడంతో తట్టుకోలేక స్కూల్ మేనేజ్మెంట్ కు ఫిర్యాదు చేసింది. స్కూల్ మేనేజ్మెంట్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆమె తట్టుకోలేక తన తల్లికి ఫోన్ చేసింది. తనకు బతకాలని లేదని.. అందువల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నానని ఆమె చెప్పింది.. ఆ తర్వాత స్కూల్ బిల్డింగ్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
ఆ విద్యార్థిని అలా స్కూల్ బిల్డింగ్ నుంచి దూకి అంతటి దారుణానికి పాల్పడుతున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. అవన్నీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. అంతటి పసివయసులో భయాన్ని కలగజేసిన వారందరిపై చర్యలు తీసుకోవాలని అక్కడి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. మరి దీనిపై అక్కడ పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
Neerja Modi School, Jaipur, Rajasthan, has released CCTV footage.
In it, Amayra herself climbs onto the fourth-floor railing and jumps from there.
A man is also seen behind her.
The girl may have been provoked. Only a thorough investigation will reveal why Amayra jumped to her… pic.twitter.com/zvoc5tra4w— Param Choudhary (@Param_117) November 2, 2025