https://oktelugu.com/

Crime News: కొత్త దంపతులు బెడ్ రూంలోకి వెళ్లారు.. ఆ తరువాత ఆ విషయం తెలిసి వధువు షాక్.. అసలేం జరిగిందంటే?

అడపిల్లను కొత్త ఇంట్లోకి పంపే ముందు ఆ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు. అలా ముందుగా తెలుసుకున్న తరువాతే పెళ్లిళ్లు చేసేవారు. అలా చేసిన పెళ్లిళ్లు విజయవంవమయ్యాయి. కానీ నేటి కాలంలో ఇాలాచూసి అలా పెళ్లి చేసుకుంటున్నారు. అలా జరిగిన పెళ్లితో ఓ అమ్మాయికి అనుకోని సంఘటన ఎదురైంది? అసలేం జరిగిందంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : October 3, 2024 / 06:02 PM IST

    Crime News

    Follow us on

    Crime News: పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. బంధువులు, స్నేహితులు మధ్య ఈ వేడుకను ఆడంబరంగా చేసుకుంటారు. కొందరు ఈ తంతును వారం రోజుల పాటు నిర్వహించుకుంటే మరికొందరు సింపుల్ గా ఒక్క రోజులో పూర్తి చేస్తారు. పెళ్లి ఎలా చేసుకున్నా.. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్ని పెళ్లిళ్లల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు పెళ్లి చేసేముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని అనేవారు. ఎందుకంటే అడపిల్లను కొత్త ఇంట్లోకి పంపే ముందు ఆ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు. అలా ముందుగా తెలుసుకున్న తరువాతే పెళ్లిళ్లు చేసేవారు. అలా చేసిన పెళ్లిళ్లు విజయవంవమయ్యాయి. కానీ నేటి కాలంలో ఇాలాచూసి అలా పెళ్లి చేసుకుంటున్నారు. అలా జరిగిన పెళ్లితో ఓ అమ్మాయికి అనుకోని సంఘటన ఎదురైంది? అసలేం జరిగిందంటే?

    పెళ్లయిన తరువాత కార్యం చేయడం పైనే అందరు దృష్టి పెడుతారు. ఇద్దరు ఏకాంతంగా ఉండి ముద్దు ముచ్చట్ల కోసం వీరిని ఒకే గదిలోకి పంపుతారు. ఈ సమయంలో పరిచయం లేని వ్యక్తులు తమ గురించి తెలుసుకుంటారు. ఆ తరువత ఒకరిపై మరొకరు ప్రేమ చూపిస్తూ దగ్గరవుతారు. ఈరోజు జరిగే కార్యక్రమం విజయవంతం అయితేనే వధూవరులిద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం కలుగుతుంది. కానీ ఎన్నో ఆశలతో, ఎంతో కోరికతో తన ఐదో తనం కోసం గదిలోకి వెళ్లిన ఓ యువతికి వింత సంఘటన ఎదురైంది. బెడ్ రూంలో జరిగిన ఈ విషయంపై తాను ఎవరికీ చెప్పుకోలేక మదనపడింది. తాను పెళ్లి చేసుకున్న భర్తకు విషయం లేదని తెలుసుకుంది. అతను సంసారానికి పనికి రాడని అర్థం కావడంతో ఎంతో ఆవేద చెందింది.

    ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలోని పినహ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి ఆరు నెలల కిందట ఓ యువతితో వివాహం జరిగింది. వీరి పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కట్న కానుకలు సమర్పించి ఆడపిల్లను సాగనంపారు. అయితే పెళ్లయిన రాత్రి కార్యం జరిగే సమయలో భర్త గురించి తెలిసిన తరువాత ఆ యువతి ఎంతో బాధపడింది. ముందుగా ఎవరికీ చెప్పుకోలేక మదనపడిన ఆమె ఆ తరువాత తన అత్తకు తెలియజేసింది.

    అయితే వారు విషయం అర్థం చేసుకోకుండా కొత్త కోడలిపై చేయి చేసుకున్నారు. అంతేకాకుండా కొట్టి తరిమేశారు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యుల సహాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. అయితే తన బాధను అర్థం చేసుకోకుండా తనపైనే దాడికి దిగారని ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పుకొని ఆవేదన చెందింది. అయితే చాలా మంది మగవాళ్లు తమ గురించి చెప్పకుండా ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, అందువల్ల పెళ్లి చేసుకునే ముందే ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ముఖ్యంగా నేటి కాలంలో చాలా మంది ఇలాంటి విషయంలో మోసపోతున్నారని కొందరు చర్చించుకుంటున్నారు.