Dhoom 4: ధూమ్ 4 లో విలన్ గా నటించడానికి సిద్ధం అవుతున్న తెలుగు స్టార్ హీరో…

బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒకప్పుడు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అసలు ఏ మాత్రం మంచి సినిమాలు రావడం లేదు...అందుకే ప్రేక్షకులు బాలీవుడ్ హీరోల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు...

Written By: Gopi, Updated On : October 5, 2024 10:45 am

Dhoom 4

Follow us on

Dhoom 4: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రస్తుతం ఆ ఇండస్ట్రీని ఒక్క స్టార్ హీరో కూడా కాపాడలేకపోతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలందరూ ఇలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేయలేకపోవడం విశేషం…ఇక మొత్తానికైతే ఆ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి ఉన్న ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతుంది. సినిమాలు వచ్చినవి వచ్చినట్లుగా ఫ్లాప్ అవుతుంటే, మన తెలుగు హీరోల సినిమాలు మాత్రం సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులకు అక్కడి హీరోల కంటే మన హీరోల మీదనే అభిమానం ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి దీన్ని అక్కడ హీరోలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి మొత్తానికైతే మన హీరోలకి బాలీవుడ్ లో కూడా భారీ డిమాండ్ పెరిగింది. ఇక దాంతో బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోదన్ చేస్తున్న ‘వార్ 2 ‘ సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండటం విశేషం… ఇక ఈ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. మరి ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కనక భారీ సక్సెస్ సాధిస్తే ఆయనకు అక్కడే భారీ ఆఫర్స్ వస్తాయని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీయార్ ధూమ్ 4 సినిమాలో విలన్ గా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో విలనే హీరో కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ధూమ్ మొదటి పార్ట్ లో జాన్ అబ్రహం నటించగా, సెకండ్ పార్ట్ లో హృతిక్ రోషన్, థర్డ్ పార్ట్ లో అమీర్ ఖాన్ నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఫోర్త్ పార్ట్ కి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకోవాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ధూమ్ సిరీస్ కి చాలా గొప్ప పేరైతే ఉంది. మరి దానికి అనుకూలంగానే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించి అక్కడి ప్రేక్షకులనే కాకుండా యావత్ ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడి చేత శభాష్ అనిపించుకునేలా సినిమా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడా లేదా అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రాలేదు.

మరి తొందర్లోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా సినిమా యూనిట్ తెలియజేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ధూమ్ 4 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనక ఉన్నట్లైతే ఆ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయి…