https://oktelugu.com/

Crime News : ఐటీ కారిడార్ లో భారీ దొంగతనం.. రెండు కోట్ల నగదు, తులాలకొద్దీ బంగారం చోరీ.. దీని వెనుక ఎవరున్నారంటే..

నిత్యం ఉద్యోగులతో సందడిగా ఉండే హైదరాబాదులోని ఐటీ కారిడార్ లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగర శివారులోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోరీ జరిగింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 22, 2024 / 05:57 PM IST

    Crime News

    Follow us on

    Crime News :  మక్త గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తికి శంకర్ పల్లి గ్రామంలో 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి బహిరంగ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇటీవల కొంతమంది ఆ భూమిని కొనుగోలు చేయడానికి వచ్చారు. ఇద్దరి మధ్య బేరం కుదరడంతో ముందస్తుగా రెండు కోట్ల రెండు లక్షల నగదును నాగభూషణానికి ఇచ్చారు. మరో స్థిరాస్తి కొనుగోలు చేయడానికి నాగభూషణం ఆ నగదు మొత్తాన్ని ఇంట్లోనే దాచాడు. ఆ నగదు తో పాటు ఇంట్లో 28 తులాల బంగారం కూడా ఉంది. శనివారం రాత్రి నాగభూషణం భోజనం చేసి పడుకున్నాడు. కుటుంబ సభ్యులు కూడా ఆ నిద్రకూ ఉపక్రమించారు. అయితే దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తాళాలు పగలగొట్టారు. అందులో ఉన్న నగదు దొంగిలించారు. బంగారాన్ని కూడా తిరస్కరించారు. ఉదయం లేచి చూడగానే బీరువాలో నగదు కనిపించలేదు. బంగారం కూడా లేకపోవడంతో నాగభూషణం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడు. కుటుంబ సభ్యులను లేపి జరిగిన సంఘటన మొత్తం వారికి వివరించాడు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లూస్ టీం తో అక్కడికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి వచ్చింది . పరిసర ప్రాంతాలను పోలీసులు పరిశీలించారు. బీరువా పగలగొట్టిన విధానం.. డబ్బు దొంగిలించిన పద్ధతి.. అన్నింటిని చూశారు. వేలి ముద్రలు స్వీకరించారు.

    చోరీ చేసింది అతడేనా..

    నాగభూషణం వద్ద ఓ వ్యక్తి చాలా సంవత్సరాలుగా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల నాగభూషణం భూ లావాదేవీ జరుగుతుండగా అతడు దగ్గరుండి చూశాడు. నగదు కూడా తీసుకురావడంలో అతడు నాగభూషణానికి సహాయం చేశాడు. భారీగా నగదు చూడటంతో అతనిలో దురాశ పుట్టిందని సమాచారం. అయితే ఈ నగదు చోరీకి గురికావడంలో అతని పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని నాగభూషణం కూడా చెప్పడంతో పోలీసులు వెంటనే ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిదైన శైలిలో విచారిస్తున్నారు. “దొంగతనం జరిగిందనే విషయం మాకు ఫోన్ చేసి చెప్పారు.. సంఘటనా స్థలానికి వచ్చాం. వివరాలు సేకరించాం. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటపెడతాం. భారీగా నగదు చోరీకి గురి కావడంతో అన్నివైపులా ఆధారాలు సేకరిస్తున్నాం. ఇప్పటికైతే నాగభూషణం డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని” పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ సంఘటనతో పోలీసులు ఆ ప్రాంతంలో బందోబస్తును పెంచారు.. సీసీ కెమెరాల పుటేజి పరిశీలిస్తున్నారు. అయితే ఆ డ్రైవర్ ను విచారిస్తున్న క్రమంలో పోలీసులకు సరికొత్త విషయాలు తెలిసాయని తెలుస్తోంది. దీంతో ఈ కేసులో పురోగతి లభించినట్టు ప్రచారం జరుగుతోంది.