Devara Movie second trailer : మరో 5 రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలై 1.6 మిలయన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రీమియర్స్ లో ఈ చిత్రం నార్త్ అమెరికా లో ‘సలార్’ రికార్డ్స్ ని కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైంది. హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కర్ణాటక లో కాసేపటి క్రితమే 150 షోస్ తో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగానే ఏ రేంజ్ సునామీ ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబందించిన థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఎదో ఊహిస్తే ఇలా ఉందేంటి అని అందరూ అనుకున్నారు. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్ కూడా తగ్గిపోయింది. అయితే అభిమానుల్లో సరికొత్త జోష్ నింపేందుకు కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబందించిన రెండవ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి కూడా ఫ్యాన్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. ‘ఆచార్య’ సినిమాలో కొరటాల శివ పాదగట్టం అనే పదాన్ని ఎన్నిసార్లు ఉపయోగించాడో, ఈ సినిమాలో ఆయన ‘భయం’ అనే పదాన్ని అన్ని సార్లు ఉపయోగించాడు. VFX షాట్స్ కూడా చాలా యావరేజ్ ఉన్నాయి. ముఖ్యంగా షార్క్ తో ఎన్టీఆర్ ఫైట్ చేసే షాట్ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది.
ఈ చిత్రం కోసం నిర్మాతలు 300 కోట్ల రూపాయిలు ఖర్చు చేశామని అన్నారు. ఆ ఖర్చు అయితే రెండు ట్రైలర్స్ లో కనిపించలేదు. సినిమాలో కంటెంట్ కూడా చాలా రొటీన్ గానే ఉన్నట్టుగా అనిపించింది. ఒక ఊరికి పెద్దగా ఉండే ఎన్టీఆర్ తో స్నేహం గా ఉంటూ సైఫ్ అలీ ఖాన్ దొంగ దెబ్బ తీసి చంపేస్తాడు. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే అందరూ అనుకున్నట్టుగా ‘దేవర’ క్యారెక్టర్ చనిపోదు. తనని దొంగ దెబ్బ తీసిన వారిని, సముద్రాన్ని అద్దం పెట్టుకొని అక్రమ వ్యాపారాలు చేసిన వారిని దేవర చంపుతుంటాడు. ఇది ఇప్పటి వరకు విడుదలైన రెండు ట్రైలర్స్ ని చూసి చిన్న పిల్లవాడు కూడా స్టోరీ చెప్పేయగలడు. కథ రొటీన్ అని తెలిసిపోయింది, VFX కూడా అనుకున్నంత లేదు. ఇక ఈ చిత్రం మీద అభిమానులు ఆశలు పెట్టుకోవాల్సింది స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ మీదనే. ఈ రెండిటిని కొరటాల పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసుంటే కథ ఎంత రొటీన్ గా ఉన్నా జనాలు పట్టించుకోరు. మరి ఆ విధంగా సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి. ఎన్టీఆర్ కూడా అనేక ఇంటర్వ్యూస్ లో చివరి 30 నిమిషాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పాడు. ఇటీవలే రాజమౌళి ఈ చిత్రాన్ని వీక్షించాడట, ఆయన కూడా చివరి 30 నిమిషాలు గురించే మాట్లాడాడు అట. మరి అంతలా ఆకట్టుకునే విదంగా ఆ 30 నిమిషాలు ఏముందో చూడాలి.