https://oktelugu.com/

Guinness Book of World Records : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మెగాస్టార్ చిరంజీవి పేరు ని ఇక నుండి మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చూడవచ్చు. ఎందుకంటే ఇండియా లోనే అత్యధిక పాటలకు డ్యాన్స్ వేసిన ఏకైక హీరో ఆయనేనట. దీనిని గుర్తించి ఆయనకు ఈ అవార్డుని అందచేయబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ అవార్డు ని చిరంజీవికి తన చేతుల మీదుగా అందించబోతున్నాడట.

Written By: Vicky, Updated On : September 22, 2024 5:47 pm

Guinness Book of World Records

Follow us on

Guinness Book of World Records : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి సాధించనిది అంటూ ఏది మిగలలేదు. ఇప్పటి తరం హీరోలు భవిష్యత్తులో లో కూడా ఆయన రేంజ్ ని అందుకోలేరేమో. రికార్డ్స్, అవార్డ్స్, రివార్డ్స్, జాతీయ స్థాయి గుర్తింపు, ఇలా ఒక్కటా రెండా ఒక స్టార్ హీరో చూడాల్సినవి చూసేసాడు. ఒకే మూసలో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమాని సరికొత్త పంధాలోకి తీసుకొచ్చిన నటుడు ఆయన. డ్యాన్స్, ఫైట్స్ లో వేగవంతం చిరంజీవి ద్వారానే మన తెలుగు సినీ పరిశ్రమకి సంక్రమించాయి. రీసెంట్ గానే మెగాస్టార్ కి పద్మవిభూషన్ అవార్డు ఇవ్వడం పై మెగా అభిమానులు ఎంతలా సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికీ అభిమానులు ఆ ఉత్సాహ పూర్తిగా బయటకు, ఇంతలోపే మరో శుభవార్త వారి ఉత్సహాన్ని మరింత రెట్టింపు చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి పేరు ని ఇక నుండి మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చూడవచ్చు. ఎందుకంటే ఇండియా లోనే అత్యధిక పాటలకు డ్యాన్స్ వేసిన ఏకైక హీరో ఆయనేనట. దీనిని గుర్తించి ఆయనకు ఈ అవార్డుని అందచేయబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ అవార్డు ని చిరంజీవికి తన చేతుల మీదుగా అందించబోతున్నాడట. ఇప్పటి వరకు మన తెలుగు సినీ పరిశ్రమలో కేవలం బ్రహ్మానందం కి మాత్రమే ఆ అదృష్టం దక్కింది. అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా బ్రహ్మానందం నిలిస్తే, మెగాస్టార్ అత్యధిక పాటలకు డ్యాన్స్ వేసిన హీరో గా నిలిచాడు.

చూస్తుంటే రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా మెగా ఫ్యామిలీ కి ఆ దేవుడు ఇచ్చిన వరం లాగా అనిపిస్తుంది. ఈమె ఈ కుటుంబం లోకి అడుగుపెట్టినప్పటి నుండి అన్ని శుభాలే జరిగాయి. రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ తో పాటు, ఆస్కార్ అవార్డు ని ముద్దాడే అదృష్టం. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి కి పెళ్లి జరగడం, పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సక్సెస్ అవుతూ, నూటికి నోరు శాతం పోటీ చేసిన అన్నీ స్థానాల్లో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉప ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా, 5 ముఖ్యమైన శాఖలకు మంత్రి అవ్వడం. చిరంజీవి కి వాళ్తేరు వీరయ్య లాంటి హిట్ తో పాటు పద్మ విభూషన్ అవార్డుతో పాటు ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కడం, ఇలా ఎన్నో అద్భుతాలు ఈ కుటుంబంలో చోటు చేసుకున్నాయి. భవిష్యత్తులో ఇంకెన్ని విజయాలు వస్తాయో చూడాలి. ఈ ఏడాది రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం డిసెంబర్ 20 నా విడుదల కాబోతుంది. ఈ చిత్రం విడుదలైన 20 రోజులకే చిరంజీవి విశ్వంభర చిత్రం విడుదల కాబోతుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలు రాబోతున్నాయి. వీటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.