Man cheats Woman: ఈ కాలంలో యువతీ యువకులు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటున్నారు. తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. కొత్త స్నేహాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఎంత వేగంగా అయితే ప్రేమలో పడుతున్నారో.. అంతే వేగంగా విడిపోతున్నారు. ప్రేమలో ఉన్నన్ని రోజులు లోకాన్ని మర్చిపోతున్నారు. స్వర్గపు లోకపు దారుల్లో వివరిస్తున్నారు. చివరికి తేడా వస్తే ఒకరి భాగోతాలు మరొకరు బయట పెట్టుకుంటున్నారు. అటువంటిదే ఈ సంఘటన కూడా.
ఆమె వయసు 26 సంవత్సరాలు. స్వస్థలం ఏపీలోని బాపట్ల. హైదరాబాదు నగరానికి చాలా రోజుల క్రితం వచ్చింది. ఇక్కడ ఒక బీమా సంస్థలో మేనేజర్ గా పనిచేస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో ఒక అబ్బాయి ఆమెకు పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమకు దారితీసింది. అప్పటినుంచి అతనితో చనువు పెంచుకుంది. ఎలాగూ పెళ్లి చేసుకుంటామనే ఉద్దేశంతో శారీరకంగా కలిసి పోయారు. అక్కడ పిలిచినప్పుడల్లా ఎస్ ఆర్ నగర్ లోని ఓయో గోకుల్ గ్రాండ్ హోటల్ కు తరచూ వెళ్ళేది. ఇలా 2022లో ఆమె గర్భం దాల్చింది. దీంతో అతడు ఆమెకు గర్భ స్రావం చేయించాడు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇద్దరు అదే ప్రాంతంలో కలుసుకునేవారు. అయితే ఇటీవల కాలంలో పెళ్లి చేసుకోవాలని అతని మీద ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆమె ఫోన్ నెంబర్.. సామాజిక మాధ్యమాలను అతడు నిషేధిత జాబితాలో పెట్టాడు.
తట్టుకోలేక పోయిన ఆమె అతడి తల్లిదండ్రులను కలిసింది. జరిగిన విషయం చెప్పింది. అయితే వారు కూడా ఈమెను బెదిరించడంతో ఏం చేయాలో తెలీక వెనక్కి వచ్చింది. తన తల్లిదండ్రులను ఆ యువతి కలిసిన విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఆమెను బెదిరించసాగాడు. వారిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిపోయిన ఆమె ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నవారు దర్యాప్తు చేస్తున్నారు.. వాస్తవానికి ఆమెను కేవలం అతడు శారీరక సుఖం కోసమే వాడుకున్నట్టు తెలుస్తోంది.. ప్రేమ పేరుతో వంచించి చివరికి ఇలా మోసం చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు సమాచారం.