Maharashtra Crime News: అసలు వాడు మనిషి కాదు. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. అందువల్లే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. వాడు ఆ ఘోరానికి పాల్పడుతున్నప్పుడు ఆ యువతి ఎంత ఇబ్బంది పడిందో.. ఎంతలా విలవిల లాడిపోయిందో.. నావల్ల కాదు.. నన్ను వదిలేయ్.. రక్తం తీవ్రంగా కారుతోంది అని చెప్పినప్పటికీ ఆ దుర్మార్గుడు వదిలిపెట్టలేదు. పైగా తన పైశాచికాన్ని మరింత దారుణంగా ప్రదర్శించాడు. చివరికి ఆమె ప్రాణం కోల్పోయింది.
మహారాష్ట్రలోని పాల్ ఘర్ ప్రాంతానికి చెందిన నీలేష్ కు ఇటీవల వివాహం కుదిరింది. అతనికి కాబోయే భార్య స్వగ్రామం జిబల్దర్. ఆ యువతికి మైనారిటీ తీరకముందే కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.. వారి పేదరికం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కుదిరింది.. త్వరలోనే వివాహం జరిపిస్తామని ఇరు వైపులా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఫోన్లో నీలేష్.. అతడికి కాబోయే భార్య మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే ఉన్నట్టుండి నీలేష్ జిబల్దార్ ప్రాంతానికి వెళ్ళాడు. నేరుగా తనకు కాబోయే భార్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉంది. ఆమెతో మాటలు కలిపాడు. కాబోయే భర్త కదా అని ఆమె కూడా చనువుగా మాట్లాడింది. దీనిని అవకాశం గా తీసుకున్న అతడు ఆమె మీద బలాత్కారం చేయబోయాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. ఎలాగో కాబోయే భార్యా భర్తలమే కదా అంటూ అతడు మరింత దురుసుగా ప్రవర్తించాడు. మొదట్లో ఆమె తోసిపుచ్చింది. ఆ తర్వాత తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. ఆమె కింద పడటంతో నుదుటికి గాయమైంది.
రక్త స్రావం జరుగుతున్నప్పటికీ..
నుదుటికి గాయమై రక్తం కారుతున్నప్పటికీ నీలేష్ ఆమెను వదిలిపెట్టలేదు. పైగా ఆమెపై చేయకూడని దారుణానికి ఒడి కట్టాడు. ఆమె ఎంతగా మొతుకున్నప్పటికీ వదిలిపెట్టలేదు. తను చేయాల్సింది చేశాడు. చివరికి ఆమెపై పలుసార్లు దారుణానికి పాల్పడిన తర్వాత ఉరివేసి చంపేశాడు. ఆ యువతి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా గుండెలు బాదుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.