Mahavatar Narsimha movie message: ఇటీవల థియేటర్లోకి వచ్చి సంచలనం సృష్టించిన మహావతార్ నరసింహ గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. యానిమేషన్ రూపంలో వచ్చిన ఈ సినిమాను సినీ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. చిన్న సినిమా అనుకున్న కూడా భారీ కలెక్షన్లతో పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తుంది. అయితే ఈ సినిమాలోని సన్నివేశాలు మాత్రమే కాకుండా సందేశాలు ఎంతో బాగున్నాయని కొందరు అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పండితులు సైతం నరసింహ సినిమా గురించే చర్చిస్తూ ఉండడం విశేషం. అయితే ఇందులో ఒక విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని.. ఇది మానవ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందని కొందరు ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆ సందేశం గురించి ఇప్పుడు చూద్దాం..
ఈ సినిమాలో హిరణ్యకశపుడు, ప్రహ్లాదుడు, నరసింహ పాత్రల చుట్టే సినిమా నడుస్తుంది. అయితే వీరిలో హిరణ్యకశపుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన ఆధిపత్యం కోసం సొంత కొడుకునే అంతం చేయాలని అనుకుంటాడు. తనకు శత్రువు అయిన నారాయణుడి మంత్రం చదవద్దని చెబుతూ ఉంటాడు. అయితే లోకమంతా దైవ పూజలో ఉంటే హిరణ్యకషపూడికి మాత్రం ఈ బుద్ధి రావడానికి కారణం అతని జన్మే అని పురాణాలు చెబుతూ ఉంటాయి. ఎందుకంటే హిరణ్య కసపొడి తల్లిదండ్రులు కశ్యప మహర్షి, దితి సత్య యుగంలో ఉంటారు. అయితే వీరు సంధ్యా సమయంలో కలయిక వలన హిరణ్యకశపుడు, అతని సోదరుడు హిరణ్యకుడు జన్మిస్తారు. అంటే కలవకూడని సమయంలో కలవడం వలన రాక్షసులు జన్మిస్తారు అని వీరి జననం తెలుపుతుంది.
అంతేగాని కొన్ని పనుల వల్ల రాక్షసులు జన్మించారు అని అంటున్నారు. ఉదాహరణకు 30 ఏళ్ల స్నేహితుడు మరణిస్తే.. తన ఇంట్లో శుభకార్యం ఉందని ఓ స్నేహితుడు వెళ్లకుండా ఉంటాడు. అలాగే దగ్గర బంధువుల్లో ఒకరు మరణిస్తే తన భార్య గర్భవతిగా ఉందని వెళ్లకుండా ఉంటారు. ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని పండితులు అంటున్నారు. అయితే ఇలా చేస్తే రాక్షసులు పుడతారని భావిస్తానని చెబుతున్నారు. వాస్తవానికి ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని.. పుట్టే వారి జీవితం బాగుంటుందని చెబుతున్నారు. భార్యాభర్తల కలయికల సమయాలు.. రోజులను బట్టి వారి పిల్లలు మంచివారా? చెడ్డవారా? అనేది తేలుతుందని చెబుతున్నారు.
అందువల్ల భార్యాభర్తలు ఇష్టం వచ్చిన సమయంలో కాకుండా నిర్ణీత సమయంలోనే కలవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారితోపాటు వారి భవిష్యత్తు బాగుంటుందని అంటున్నారు. పిల్లలు బాగా లేకపోతే తల్లిదండ్రులపైనే ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అందుకు ముందుగా వారి కలయిక సమయాన్ని కూడా సరి చేసుకోవాలని అంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా కలయిక ఉండడం ఏమాత్రం మంచిది కాదని ఈ నీతి చెబుతుందని పండితులు సైతం పేర్కొంటున్నారు.