Khazana Jewellers Incident:హైదరాబాద్ నగరంలోని చందానగర్లో మంగళవారం ఖజానా జ్యువెలర్స్ లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. దోపిడి దొంగలు ముసుగులు వేసుకొని వచ్చి మంగళవారం షాప్ తెరిచిన ఐదు నిమిషాల్లోనే అందులోకి ప్రవేశించి బంగారాన్ని, నగదును దొంగిలించుకుని వెళ్ళిపోయారు. కాల్పులకు కూడా పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఖజానా జ్యువెలర్స్ అసిస్టెంట్ మేనేజర్ కాలికి గాయమైంది. అయితే ఈ దోపిడీలో ఆరుగురు వరకు పాల్గొన్నారని తెలుస్తోంది.
మంగళవారం ఉదయం షాపులోకి ప్రవేశించిన దోపిడి దొంగలు పదునైన ఆయుధాలతో షాపు అద్దాలు ధ్వంసం చేశారు. బంగారు నగలను తమ సంచిలో వేసుకున్నారు. నగదు బాక్స్లను బద్దలు కొట్టి అందులో ఉన్న నోట్ల కట్టలను కూడా తమ వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి వేగంగా పారిపోయారు. వారు దొంగతనం చేసిన తీరు అచ్చం ధూమ్ సినిమాను తలపించింది. తుపాకులతో బెదిరించి.. సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి వారు దోపిడికి పాల్పడ్డారు.
Also Read: భారీ వర్షాలు.. తెలంగాణలో స్కూళ్లకు ఐదు రోజుల సెలవులు.. ఏపీలో సెలవులపై అప్డేట్ ఇది
దొంగలు దోపిడీ చేసిన దృశ్యాలను హైదరాబాద్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. దోపిడి దొంగలు దొంగతనం చేస్తున్న దృశ్యాలు షాపులో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఈ వీడియోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. దొంగలు తమ ముఖాలు కనిపించకుండా ఉండడానికి మాస్కులు ధరించారు. ఒక చిన్న క్లూ కూడా వదిలిపెట్టలేదు. అయితే ఈ షాపులో దొంగతనం అప్పటికప్పుడు అనుకుని చేసింది కాదని.. చాలా రోజుల నుంచి దొంగలు రెక్కీ నిర్వహించారని… మంగళవారం ఉదయం షాపు ఓపెన్ చేసిన ఐదు నిమిషాల్లోనే అందులోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ దోపిడి దొంగలను పట్టుకోవడానికి తెలంగాణ పోలీసులు 12 బృందాలుగా విడిపోయారు. వారికోసం గాలిస్తున్నారు. అయితే ఎంత బంగారం పోయింది, ఎంత నగదు తస్కరణకు గురైంది.. అనే విషయాలను ఖజానా జ్యువెలర్స్ యాజమాన్యం బయటికి చెప్పడం లేదు.
హైదరాబాద్ ఖజానా జ్యువెలర్స్ లో దొంగతనం జరిగింది ఇలా
ముందుగా షాపులోకి ప్రవేశించిన దొంగలు బంగారాన్ని తమ బ్యాగుల్లో వేసుకున్నారు. క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదును తస్కరించారు.
సీసీ కెమెరాలలో తమ ముఖాలు కల్పించకుండా ఉండడానికి మాస్కులు ధరించారు. అత్యంత పదునైన ఆయుధాలతో క్యాష్ కౌంటర్… pic.twitter.com/20Nn3THSsQ
— OkTelugu (@oktelugunews) August 13, 2025