School Holidays: భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యార్థులకు వరుసగా సెలవులు రాబోతున్నాయి. మంగళవారం కురిసిన వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరద ఉద్రిక్తంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే యాదాద్రి జిల్లాలోని వర్ష బీభత్సం సృష్టిస్తోంది. దీంతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అధికారులకు సెలవులను రద్దు చేశారు. వర్షాలు ముగిసే వరకు అధికారులు అంతా విధుల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సమయంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవులతో కలిపితే ఈ వారం మొత్తం సెలవులే ఉండనున్నాయి. అవి ఎలాగంటే?
Also Read: ప్యారడైజ్ లో జడల్ క్యారెక్టర్ వెనక ఉన్న రహస్యం ఇదేనా..?
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ప్రభుత్వం రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు.. వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో బుధవారం, గురువారం సెలవులను ప్రకటించింది. అయితే బుధవారం, గురువారం సెలవులతో మరో రెండు సెలవులు కలవాలి ఉన్నాయి. ఆ తర్వాత ఆదివారం రానుంది. ఇలా మొత్తం ఐదు రోజులపాటు సెలవులు ఉండనున్నాయి., బుధ, గురువారాలు ప్రభుత్వం ప్రకటించిన సెలవులు అయితే.. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం ఉండనుంది. ఈరోజు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్న వరకు మాత్రమే పనిచేస్తాయి. మిగతా హాఫ్ డే హాలిడే ఉండనుంది. అయితే మరుసటి రోజు శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకో నున్నారు. దీంతో ఈరోజు కూడా సెలవు ఉండరు ఉంది. ఇక ఆదివారం నాడు సాధారణ సెలవు అన్న విషయం తెలిసిందే.
గత వారంలో కూడా శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, శనివారం రాఖీ పౌర్ణమి పండుగలు వచ్చి.. ఆదివారం సాధారణ సెలవు వచ్చింది. ఈ వారం వర్షాలకు రెండు రోజులు సెలవులు రావడంతో మొత్తం ఐదు రోజులు పాఠశాలలకు హాలిడే ఉండనుంది. అయితే ఈ సెలవులు ఉమ్మడి వరంగల్, యాదాద్రి జిల్లాలో మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు హైదరాబాదులోనూ వర్ష బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఇక్కడి పాఠశాలలు మధ్యాహ్నం వరకే పని చేస్తాయని పేర్కొంది. ఎందుకంటే సాయంత్రం సమయంలో వర్షం పడడంతో ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో వరదనీరు పొంగడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది.
తెలంగాణలో వర్షాలు ఉండడంవల్ల పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు వంటి ప్రాంతాల్లో వర్షాలు విజృంభిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అనేక కష్టాలు పడుతున్నారని చెబుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రాంతాలకు సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు, కొందరు ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సెలవులపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ కూడా సెలవులపై ప్రకటన చేస్తుందా? లేదా? చూడాలి.