Hyderabad: ఇది మామూలు దారుణం కాదు. సభ్య సమాజం తలదించుకునే ఘోరం. అసలు ఇలా కూడా జరుగుతుందా.. మనుషులు ఇలా కూడా ఉంటారా.. ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా.. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత సగటు మనుషులు ఇటువంటి భావాలే వ్యక్తం అవుతున్నాయి.
దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య “ఆ కార్యక్రమం” జరగాలి. అలాగని ఆరోగ్యాలు సరిగా లేనప్పుడు అటువంటి పనిచేయకూడదు. ముఖ్యంగా భార్య గర్భం దాల్చినప్పుడు అటువంటి వ్యవహారాలకు పాల్పడకూడదు. కానీ ఈ సంఘటనలో ఈ భర్త ఘోరానికి పాల్పడ్డాడు. దారుణంగా వ్యవహరించాడు. దీంతో ఆ భార్య కీలక నిర్ణయం తీసుకుంది. కాల యముడు లాంటి భర్త దుర్మార్గాన్ని తట్టుకోలేక కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె బాధతో ఏకీభవించిన న్యాయస్థానం ఆ మూర్ఖుడైన భర్తకు.. కఠిన శిక్ష విధించింది.
సియాసత్ అనే పత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరంలో నంది ముసలాయిగూడ లో రామ్ అనే వ్యక్తి జీవిస్తున్నాడు. ఇతడు ఒక టైలర్. ఇతడికి లతా అనే మహిళతో వివాహం జరిగింది.. భార్యతో అతడి ప్రవర్తన ప్రారంభంలో బాగానే ఉండేది. ఆ తర్వాత అతడు తన వికృత రూపాన్ని బయటపెట్టాడు. ప్రతిరోజు భార్యను ఇబ్బంది పెట్టసాగాడు. ముఖ్యంగా ఆ విషయంలో తన అసహజమైన కోరికలను ఆమె ముందు ఉంచేవాడు. ఆమెను అలా చేయాలని బలవంత పెట్టాడు. ఆమెను శారీరకంగా హింసించేవాడు. ఈలోగా గర్భం దాల్చింది. అయినప్పటికీ అతడు తన క్రూరత్వాన్ని దాచుకోలేదు. పైగా ఆమె పొట్ట మీద దాడి చేశాడు.
దాంపత్య జీవితంలో ఆమె మీద ప్రతి సందర్భంలోనూ అత్యంత క్రూరంగా ప్రవర్తించేవాడు. ప్రతిరోజు కూడా అత్యంత అసహజమైన లైంగిక విధానాలకు పాల్పడేవాడు. ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. భర్త ఇబ్బందులను తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్షాలతో సహా వారికి తాను పడుతున్న బాధలను వివరించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో పూర్తిస్థాయిలో సాక్షాలు సబ్మిట్ చేయడంతో.. రామ్ కు న్యాయస్థానం ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
