Gujarat Women Death : ఈరోజుల్లో లివింగ్ రిలేషన్ షిప్ బాగా ఎక్కువయ్యాయి. ఒకప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి మనసులు కలిసిన తరువాత ప్రేమించుకునేవాళ్లు. ఆ తరువాత కొన్ని రోజుల పాటు కలిసి పార్కులు, వివిధ ప్రదేశాలకు వెళ్లేవాళ్లు. ఆ తరువాత పెద్దల ఇష్టంతో పెళ్లి చేసుకునేవాళ్లు. పెద్దలు ఒప్పుకోకపోతే స్నేహితుల సాయంతో రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకునేవాళ్లు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్టం ఏర్పడితే లివింగ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు. కొందరు ఒక అడుగు ముందుకు వేసి శారీరకంగా కలుస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. ఈ సంఘటనల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా నష్టపోతున్నారు. తాజాగా ఇద్దరు ప్రేమికులు కలిసి ఏకాంతంగా ఉండాలనుకున్నారు. దీంతో ఓ హోటల్ రూంలోకి వెళ్లారు. ఒరినొకరు కలుసుకున్నారు. కానీ ఆ తరువాత అమ్మాయి మరణించింది. అసలేం జరిగింది?
కొందరు ప్రేమికులు పెళ్లికి ముందే ఏకాంతంగా ఉండాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు పార్కుల్లో మాత్రమే కనిపించే కొందరు ఈమధ్య ప్రత్యేకంగా హోటల్ లోని గదులు బుక్ చేరసుకుంటున్నారు. కొన్న ప్రాంతాల్లో ఇలాంటి వారి కోసం ఓయో రూమ్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఇద్దరు వ్యక్తులు ఏకాంతంగా ఉండడానికి ఇలాంటి చోటుకు వెళ్తున్నారు. కానీ ఇవి ప్రమాదకరమైన ప్రదేశాలు అని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య కొన్ని ఓయో రూముల్లో సీసీ కెమెరాలు పెట్టిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా ఓ అమ్మాయి హోటల్ గదిలో మరణించింది.
గుజరాత్ లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే అమ్మాయి మరణించిన తీరు సాధారణంగా కనిపించడం లేదు. గుజరాత్ కు చెందిన ఓ నర్నింగ్ గ్రాడ్యుయేట్, ఆమె ప్రియుడు కలిసి సెప్టెంబర్ 23న నవ్ సారి జిల్లాలో ఓ హోటల్ లోని గదిని బుక్ చేసుకున్నారు. అప్పటికే వీరు ప్రేమికులు. కానీ ఒక రోజు ఏకాంతంగా గడపాని అనుకున్నారు. ఈ తరుణంలో వీరు గదిని వచ్చిన తరువాత ఏకాంతంగా ఉన్నారు.
కానీ అమ్మాయి మృతి చెందిన తరువాత ప్రియుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారం.. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో అమ్మాయి ప్రైవేట్ పార్టు నుంచి బ్లీడింగ్ రావడం జరిగింది. దీంతో ప్రియుడు ఏం చేయాలో అర్థం కాక ఒక క్లాత్ ను తీసుకొచ్చి అడ్డు పెట్టాడు. అయినా రక్త స్రావం ఆగలేదు. దీంతో ప్రియుడు తన స్నేహితుడి సహాయంతో అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఆ తరువాత బాధితురాలి బంధువులకో ఫోన్ చేయడంతో వారు వారు పోలీసులకు సమాచారం ఇచచారు. మృతదేహాన్ని పరిశీలించిన తరువాత కేసు నమోదు చేసుకున్నారు. ఆ తరువాత ప్రియుడిని అరెస్టు చేశారు.
అయితే ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు ఎదురైతే చాలా బాధగా ఉంటుందని కొందరు ఆవేదన చెందుతున్నారు. హోటల్ గదిలో ఏం జరిగిందోనని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి రిపోర్టు వచ్చిన తరువాత ఎలాంటి చర్యలు తీసుకునేది చెబుతామని వివరించారు.