Daayre Movie: ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలైతే మరి దారుణంగా ఉంటున్నాయి. ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆ సినిమాలను చూడాలంటే కొంత వరకు ఇబ్బంది కలిగే ఆకాశమైతే ఉంది…ఇక ఈ క్రమంలోని ‘డేరే’ (Daayre)అనే సినిమా 2023 వ సంవత్సరం నుంచి ‘షిమోరీ మీ’, ‘ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ‘ అనే రెండు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది… రొమాంటిక్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలు కొంతమందికి మాత్రం విపరీతంగా నచ్చుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ప్రదీప్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇద్దరు అక్క చెల్లెల కథతో తెరకెక్కింది… డోనా మున్షి (పరీ), ఆరోహీ ఖురానా (డింపుల్) ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది… ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేక పోవడంతో ఎలాగైనా సరే కష్టపడి కుటుంబానికి ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండకూడదని ఉద్దేశ్యంతో అక్క డింపుల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తు డబ్బులు సంపాదిస్తోంది. ఇక ఆమె సంపాదించే డబ్బు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో కొన్ని ఇల్లీగల్ పనులను కూడా చేయడానికి ఒప్పుకుంటుంది.
అలాగే చెల్లెలు కూడా జాబ్ చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి షాదీ రాకెట్ అనే ఒక ట్రాప్ లో ఇరుక్కుంటుంది… ఇక ఎట్టకేలకు చెల్లెలు పరీ పెళ్లి చేసుకుంటుంది. తన శోభనం రోజు తన భర్త బాగా తాగి ఉండడం వల్ల పరీ కి బదులు తన అక్క అయిన డింపుల్ తో శోభనం జరుపుకుంటాడు… ఈ విషయాన్ని తెలుసుకున్న పరీ, డింపుల్ ఇద్దరు మధ్య కొన్ని గొడవలైతే వస్తాయి…చివర్లో ఒకరి ప్రాబ్లమ్స్ ని మరొకరు అర్థం చేసుకొని కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో కూడిన ఒక ట్రాజడీ ట్విస్ట్ క్లైమాక్స్ ఉంటుంది.
ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఇప్పుడు చెబితే స్పైలర్ అవుతోంది. కాబట్టి ఈ సినిమాని చూసి మీరే తెలుసుకోండి… నిజానికి ఇలాంటి సినిమాలు ఒటిటి ప్లాట్ఫారంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి… వీటివల్ల ఎవరికి పెద్దగా యూజ్ అయితే ఏమీ ఉండదు కానీ రొమాంటిక్ మూవీస్ ని ఆస్వాదించే వారికి మాత్రం ఈ సినిమాలు మంచి కిక్ ఇస్తాయనే చెప్పాలి…