Brain Tumor Symptoms: ఈ లక్షణాలు ఉంటే మీ పిల్లలకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టే..

వికారం, వాంతులు: ఫ్లూ ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో బ్రెయిన్ ట్యూమర్ ఉంటే కూడా కాస్త దగ్గరి లక్షణాలే ఉంటాయట. అయితే ప్రత్యేకించి తలనొప్పి ఎక్కువగా వస్తుంది. మెదడు కణితితో సంబంధం ఉన్న ఇంట్రాక్రానియల్ లు ఒత్తిడిని కలిగిస్తాయి.

Written By: Swathi Chilukuri, Updated On : June 26, 2024 11:41 am

Brain Tumor Symptoms:

Follow us on

Brain Tumor Symptoms: బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంటుంది కదా. కానీ ఈ వ్యాధి ఈ మధ్య పిల్లలకు కూడా వస్తుంది. సకాలంలో ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం స్థితి నుంచి తప్పించవచ్చు. కానీ దీన్ని గుర్తించడం కూడా ఓ సవాలే. అయితే పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వస్తే కొన్ని లక్షణాలు ముందే కనిపిస్తాయి. అవేంటో ఓ సారి తెలుసుకోండి. మీ పిల్లలను ఈ వ్యాధి నుంచి రక్షించండి.

వికారం, వాంతులు: ఫ్లూ ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో బ్రెయిన్ ట్యూమర్ ఉంటే కూడా కాస్త దగ్గరి లక్షణాలే ఉంటాయట. అయితే ప్రత్యేకించి తలనొప్పి ఎక్కువగా వస్తుంది. మెదడు కణితితో సంబంధం ఉన్న ఇంట్రాక్రానియల్ లు ఒత్తిడిని కలిగిస్తాయి.

నిరంతర తలనొప్పి: మెదడులో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉంటే పిల్లలకు తలనొప్పి ఎక్కువ వస్తుంటుంది. ప్రత్యేకించి ఉదయం తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. కంటిన్యూగా మీ పిల్లలు తలనొప్పి, తలనొప్పి అంటే మాత్రం కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

మాట్లాడటం, దృష్టి మరియు వినికిడి ఇబ్బందులు: కణితి యొక్క స్థానాన్ని బట్టి, పిల్లలు దృష్టి లేదా వినికిడి లోపం కూడా ఉంటుంది. మాట్లాడటం కూడా ఇబ్బందిగా ఉంటుంది. మాట కాస్త యాస పోవడం, ఇబ్బంది పడటం వంటివి జరుగుతుంటాయి. సరిగ్గా చూడలేరు. మాట్లాడలేరు, వినలేరు. ఇలాంటి లక్షణాలు ఉంటే తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించడం బెబర్.

బ్యాలెన్స్ సమస్యలు: మెదడులో ఉండే ఈ కణితులు శరీర బ్యాలెన్స్ మెకానిజంకు అంతరాయం కలిగిస్తాయట. ఇది ప్రభావితమైన పిల్లలలో సమన్వయ ఇబ్బందులు ఎదుర్కుంటారు. అంతేకాదు అసమతుల్యతకు దారితీస్తుంది ఈ వ్యాధి..

ప్రవర్తనా మార్పులు: మానసికంగా ఇబ్బంది పడుతుంటారు.పనులు చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. చిరాకు, కోపం వంటి అనుకోని లక్షణాలు ఉంటే కూడా మీరు వైద్యులను సంప్రదించడం బెటర్.